Toyota Corolla: ప్రపంచవ్యాప్తంగా టొయోటా కంపెనీ తన కార్ల నమ్మకానికి, భద్రతకు పెట్టింది పేరు. అయితే కొన్నిసార్లు భద్రతా పరీక్షల ఫలితాలు అంచనాలకు భిన్నంగా వస్తుంటాయి. తాజాగా టొయోటా కొరోలా క్రాస్ విషయంలో కూడా ఇదే జరిగింది. గ్లోబల్ NCAP నిర్వహించిన ఇటీవలి క్రాష్ టెస్ట్ నివేదికలో ఈ SUVకి అడల్ట్ సేఫ్టీ (పెద్దల భద్రత)ల కేవలం 2-స్టార్ రేటింగ్ మాత్రమే లభించింది. ఇది వాహన ప్రియులను ఆశ్చర్యానికి గురిచేసింది.
గ్లోబల్ NCAP ‘Safer Cars for Africa’ ప్రచారంలో భాగంగా ఈ పరీక్షను నిర్వహించారు. ఆఫ్రికా మార్కెట్ కోసం తయారు చేసిన ఈ మోడల్‌లో ఇతర దేశాలతో పోలిస్తే స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు తక్కువగా ఉండటమే ఈ తక్కువ రేటింగ్‌కు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.
భద్రతా ఫీచర్లు
కొరోలా క్రాస్‌లో ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, నీ (మోకాలి) ఎయిర్‌బ్యాగ్, సైడ్ చెస్ట్ ఎయిర్‌బ్యాగ్, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్, లోడ్ లిమిటర్, ESC వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ హెడ్ (థొరాక్స్) ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ పెల్విస్ ఎయిర్‌బ్యాగ్‌లు ఇందులో లేవు లేదా ఆప్షనల్‌గా ఉంచారు. అలాగే పాదచారుల రక్షణ, స్పీడ్ అసిస్ట్, లేన్ అసిస్ట్ వంటి వ్యవస్థలు కూడా తగినంతగా లేవు.
Also Read: బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!
అడల్ట్ సేఫ్టీ (పెద్దల భద్రత) – పనితీరు
పెద్దల భద్రత విభాగంలో ఈ SUV కి 34 పాయింట్లకు గానూ 29.27 పాయింట్లు వచ్చాయి.
ఫ్రంటల్ క్రాష్: డ్రైవర్, ప్యాసింజర్ తల, మెడకు మంచి రక్షణ లభించింది. ఛాతీకి తగినంత రక్షణ ఉంది.
మోకాళ్లు: డ్యాష్‌బోర్డ్ వెనుక ఉన్న నిర్మాణం వల్ల మోకాళ్లకు గాయాలయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు.
బాడీషెల్: కారు బాడీ స్థిరంగా ఉన్నప్పటికీ ఫుట్‌వెల్ ఏరియా (కాళ్లు పెట్టే చోటు) అస్థిరంగా ఉన్నట్లు తేలింది.
సైడ్ ఇంపాక్ట్: సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ నిర్వహించలేదు. ఎందుకంటే ఈ కారులో స్టాండర్డ్ సైడ్ హెడ్ ప్రొటెక్షన్ లేదు. దీనివల్ల ఈ విభాగంలో సున్నా మార్కులు పడ్డాయి.
చైల్డ్ సేఫ్టీ (పిల్లల భద్రత) – 3-స్టార్ రేటింగ్
పిల్లల భద్రత విషయంలో కొరోలా క్రాస్ 3-స్టార్ రేటింగ్‌ను సాధించింది (49 పాయింట్లకు 33 పాయింట్లు).
18 నెలల చిన్నారి డమ్మీకి పూర్తి రక్షణ లభించింది.
అయితే 3 ఏళ్ల చిన్నారి డమ్మీ తల భాగంలో రక్షణ అంతంత మాత్రమే ఉందని పరీక్షలో వెల్లడైంది.
గ్లోబల్ NCAP ఆందోళన
ఆఫ్రికా వంటి మార్కెట్లలో భద్రతా ప్రమాణాలను తగ్గించడంపై గ్లోబల్ NCAP ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర దేశాల్లో ఇచ్చే స్టాండర్డ్ భద్రతా ఫీచర్లను ఆఫ్రికా మోడళ్లలో కూడా తప్పనిసరి చేయాలని కార్ల తయారీ కంపెనీలను కోరింది. అన్ని దేశాల్లోనూ ఒకే రకమైన సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించాలని ఈ సంస్థ విజ్ఞప్తి చేసింది.
