Hyundai Inster: టాటా కార్ కు పోటీని ఇస్తున్న హ్యూందాయ్ సరికొత్త కార్.. ధర, వివరాలివే?

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో కాస్పర్ ఆధారంగా పని చేసే రాబోయే మైక్రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి ఆస

  • Written By:
  • Publish Date - June 29, 2024 / 07:17 PM IST

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో కాస్పర్ ఆధారంగా పని చేసే రాబోయే మైక్రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి ఆసక్తికర వార్త ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇన్‌స్టర్ పేరుతో రిలీజ్ చేసే ఈ కొత్త బ్యాటరీ ఆధారిత క్రాస్‌ఓవర్ ఇప్పుడు దక్షిణ కొరియా, ఆసియా పసిఫిక్,యూరప్, మిడిల్ ఈస్ట్‌ తో పాటు ఇంకా కొన్ని అంతర్జాతీయ మార్కెట్‌ లలో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న 2024 బుసాన్ ఇంటర్నేషనల్ మొబిలిటీ షోలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీను లాంచ్ చేసింది. ఇన్‌స్టర్ ఈ వేసవిలో కొరియాలో లాంచ్ అయ్యింది.

ముఖ్యంగా ఇన్‌స్టర్ పట్టణ సవాళ్లను పరిష్కరించడానికి చిన్న ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని లాంచ్ చేశారు. ఇన్‌స్టర్ లుక్స్ పరంగా చూసుకుంటే ఎక్స్‌టర్‌ తో ఈక్వల్ గా ఉంటుంది. అలాగే ఈ కారు 2,580 ఎంఎం వీల్‌బేస్‌ను అందిస్తుంది. ఇన్‌స్టర్ డైమెన్షనల్‌గా ఇండియా స్పెక్ ఎక్స్‌టర్‌కి దగ్గరగా ఉంటుంది. ఇది క్యాస్పర్ కంటే మెరుగైన ఇంటీరియర్ స్థలంతో వస్తుంది. హ్యూందాయ్ ఇన్‌స్టర్ అట్లాస్ వైట్, టామ్‌బాయ్ ఖాకీ, బిజారిమ్ ఖాకీ మాట్, అన్‌బ్లీచ్డ్ ఐవరీ, అలాగే సియన్నా ఆరెంజ్ మెటాలిక్, ఏరో సిల్వర్ మ్యాట్, డస్క్ బ్లూ మ్యాట్, బటర్‌క్రీమ్ ఎల్లో పెర్ల్, అబిస్ బ్లాక్ పెర్ల్ వంటి అనేక కొత్త రంగుల ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.

ఈ కారు బయట భాగం బ్లాక్ హై గ్లోస్ రీసైకిల్ పెయింట్‌ తో రావడంతో చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇన్‌స్టర్ క్యాబిన్ ఇంటీరియర్‌ పాలిథిలిన్ టెరెఫ్తాలేట్, చెరకు నుంచి సేకరించిన బయో పాలీప్రొఫైలిన్ మెటీరియల్ వంటి స్థిరమైన పదార్థాలను ఉపయోగించి రూపొందించామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్‌బిల్ట్ నావిగేషన్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, 64 కలర్ ఎల్‌ఈడీ యాంబియంట్ లైటింగ్, వన్ టచ్ సన్‌రూఫ్ ఈ కారు ప్రత్యేకతలుగా ఉన్నాయి. బ్లైండ్ స్పాట్ కొలిషన్ ఎవాయిడెన్స్ అసిస్ట్, రియర్ క్రాస్-ట్రాఫిక్ కొలిజన్-ఎవాయిడెన్స్ అసిస్ట్, సేఫ్టీ ఎగ్జిట్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ వంటి భద్రతా లక్షణాలతో కూడిన సమగ్ర స్థాయి 2 ఏడీఏఎస్ ప్యాకేజీని కూడా ఇన్‌స్టర్ సొంతం.

ఇన్‌స్టర్ రెండు డెరివేటివ్‌లలో అంటే స్టాండర్డ్, లాంగ్ రేంజ్ అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వేరియంట్ 42 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక ఛార్జ్‌పై కనీసం 300 కిమీ గరిష్ట పరిధిని అందిస్తుంది. రెండోది 49 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 355 కిమీ పరిధిని అందిస్తుంది. స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వేరియంట్‌ల కోసం టాప్ స్పీడ్‌లు 140 నుంచి 150 కిలోమీటర్లుగా ఉంటుంది. 120 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి ఈ కారు బ్యాటరీని దాదాపు 30 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు చార్జ్ చేయవచ్చు.