Site icon HashtagU Telugu

Kratos R Electric Bike: క్రాటోస్ ఎలక్ట్రిక్ బైక్ పై బంపర్ ఆఫర్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే?

Mixcollage 04 Mar 2024 08 36 Pm 8054

Mixcollage 04 Mar 2024 08 36 Pm 8054

ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుండడంతో వీటికి ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. వాహన తయారీ సంస్థలు వీలైనన్ని ఎక్కువ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. మరికొన్ని ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన వాహనాలపై భారీగా తగ్గింపు ధరను ప్రకటిస్తున్నాయి. అలాగే ఒక పక్క మార్కెట్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు మంచి డిమాండ్‌ ఉంది. మరోవైపు ప్రభుత్వం అందిస్తున్న ఫేమ్‌-2 సబ్సిడీ సమయం ముగిసిపోతోంది. ఈ క్రమంలో అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్‌, ఏథర్‌ ఎనర్జీ వంటి కంపెనీలు తమ ఉత్పత్తులపై పలు ఆఫర్లను ప్రకటించాయి.

ఇప్పుడు ఇదే క్రమంలో పూణేకు చెందిన టోర్క్‌ మోటార్స్‌ కూడా తన ఎలక్ట్రిక్‌ బైక్‌పై మంచి డిస్కౌంట్‌ను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం సంప్రదాయ పెట్రోల్‌ వాహనాలను తగ్గించాలని ప్రణాళిక చేసింది. గ్లోబల్‌ వైడ్‌గా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తోంది. దాని కోసం కొన్సి సబ్సిడీలను ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీదారులకు అందిస్తోంది. వాటిని ఫేమ్‌ పేరుతో ఇస్తోంది. ప్రస్తుతం రెండో విడత అంటే ఫేమ్‌-2 సబ్సిడీలు నడుస్తున్నాయి. అయితే కేం‍ద్రం ఇక ఈ సబ్సిడీలను తగ్గించాలని తలపోస్తోంది. మార్చి 31 తర్వాత సబ్సిడీలను ఎత్తేయాలని నిర్ణయించింది.

దీంతో కంపెనీలు వీలైనంత వేగంగా తమ స్టాక్‌ ను క్లియర్‌ చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. తక్కువ రేట్లు ఉన్నప్పుడే గణనీయంగా సేల్స్‌ చేయాలని చూస్తున్నాయి. టోర్క్ మోటార్స్ క్రాటోస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్‌ మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనిపై రూ.37,500 తగ్గించింది. దీంతో ఈ బైక్ ధర రూ. 1.50 లక్షలుగా మారింది. ఈ తగ్గింపు మార్చి 31 వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. ఆ తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాగా టోర్క్ మోటార్స్ క్రాటోస్ ఆర్ బైక్‌ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. టోర్క్ మోటార్స్ క్రాటోస్ ఆర్ బైక్‌ ప్రధాన స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే ఇందులో 4కే డబ్ల్యూహెచ్‌ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. అలాగే 12 బీహెచ్‌పీ, 38 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే యాక్సియల్ ఫ్లక్స్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది.

దీనిలో బ్యాటరీని సింగిల్‌ చార్జ్‌ చేస్తే 180 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది అని కంపెనీ ప్రకటించింది. బైక్‌ గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్ల వేగంతో వెళ్ల గలుగుతుంది. టోర్క్ మోటార్స్ క్రాటోస్ ఆర్ బైక్‌ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జర్, యాక్టివ్ థ్రోటిల్ కంట్రోల్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ అమర్చి ఉంటుంది. ఈ బైక్‌లో ఐదు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. అవి ఎకో, ఎకో+, సిటీ, స్పోర్ట్స్, రివర్స్ మోడ్లతో రైడర్‌కు మంచి అనుభూతినిస్తుంది. ఎలక్ట్రిక్ 2-వీలర్ తయారీదారులకు ఫేమ్‌2 సబ్సిడీ పథకం ఈ నెలలో ముగుస్తున్నందున వారి ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందిస్తున్నారు. ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ కూడా తమ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఇలాంటి డిస్కౌంట్లను ప్రకటించాయి. మీరు ఒకవేళ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనుగోలు చేయాలని భావిస్తే ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిది.

Exit mobile version