Top Selling 5 Cars In Its Segment: బడ్జెట్ ధరలోనే అదరగొడుతున్న టాప్ ఫైవ్ కార్స్ ఇవే?

రోజురోజుకీ వాహన వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆయా సంస్థలు కూడా అందుకు అనుగుణంగానే రకరకాల మోడల్స్ కలిగిన కార్లను మార్కెట్ లోకి వి

  • Written By:
  • Publish Date - December 1, 2023 / 08:10 PM IST

రోజురోజుకీ వాహన వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆయా సంస్థలు కూడా అందుకు అనుగుణంగానే రకరకాల మోడల్స్ కలిగిన కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని వందల సంఖ్యలో కార్లు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. ఇవే కాకుండా ఎప్పటికప్పుడు నెలలో పదుల సంఖ్యలో మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఐదు రకాల కార్లు ఫీచర్లతో తక్కువ బడ్జెట్ లోనే వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.. ఇంతకీ ఆ టాప్ ఫైవ్ కార్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మారుతి వ్యాగన్ఆర్ కారు ధర రూ.5.54 లక్షల నుంచి మొదలై రూ.7.42 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ దీనిని 1 లీటర్, 1.2 లీటర్ ఇంజన్ ఆప్షన్లలో అమ్ముతోంది. మారుతీ వ్యాగన్ఆర్ అక్టోబర్ 2023లో భారతదేశంలో 22,080 యూనిట్లను అమ్మింది. అదేవిధంగా మైక్రో SUV గురించి మాట్లాడితే టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్సెటర్ లాంటి కార్లు ఈ విభాగంలో బాగా సేల్ అవుతున్నాయి. ఈ భాగంలో ఎక్కువగా టాటా పంచ్ అమ్ముడవుతోంది. ఈ మైక్రో SUV నుంచి అక్టోబర్‌ లో 15,317 యూనిట్లు అమ్ముడయ్యాయి. పంచ్ అనేది సేఫ్టీ ఫీచర్ లలో 5 స్టార్ రేటింగ్ ఉన్న కారు, దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.6 లక్షల నుంచి మొదలై రూ.10.10 లక్షల వరకు ఉంటుందట.

అలాగే టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా మధ్య ఈ విభాగంలో గట్టి పోటీ నడుస్తోంది. గత నెలలో, టాటా నెక్సాన్ 16,887 యూనిట్ల విక్రయాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన మూడవ కారుగా నిలిచింది. ఈ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కాంపాక్ట్ SUV ధర రూ. 8.10 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఇకపోతే సెడాన్ కార్ల విషయానికి వస్తే.. ఈ విభాగంలో మారుతి సుజుకి డిజైర్ బెస్ట్ సెల్లర్ గా చెప్పవచ్చు. మారుతి కాంపాక్ట్ సెడాన్ డిజైర్ ధర రూ.6.51 లక్షల నుంచి రూ. 9.39 లక్షల మధ్య ఉంటుంది. డిజైర్‌ చాలా కాలంగా కస్టమర్ల సపోర్టును పొందుతోంది. ఇక 7-సీటర్ MVP కార్ల గురించి మాట్లాడితే, ఈ విభాగంలో మారుతి ఎర్టిగా మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతోంది. ఎర్టిగా ధర రూ.8.64 లక్షల నుంచి మొదలై రూ.13.08 లక్షల వరకు ఉంది. అయితే ఈ కారు పెట్రోల్, CNG రెండు ఎంపికలలో అందుబాటులో ఉంది.