ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. వాహన వినియోగ దారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. దానికి తోడు ప్రభుత్వం కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతుండడంతో వీటికి డిమాండ్ మరింత పెరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ఆయా సంస్థలు ఇప్పటికే ఎన్నో రకాల ఎలక్ట్రిక్ బైక్స్ ని మార్కెట్లోకి విడుదల చేశాయి. ఇందులో ఒక దానిని మించి ఒకటి మార్కెట్లో రాణిస్తున్నాయి. మరి ప్రస్తుతం భారత మార్కెట్ లో ఉన్న టాప్ ఎలక్ట్రిక్ బైక్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్స్ లో
రివోల్ట్ ఆర్వీ400 బైక్ కూడా ఒకటి.
ఈ ఈ బైక్ ధర రూ. 1.62 లక్షలుగా ఉంది. ఈ బైక్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 80-150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే ఈ బైక్లో ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. దీని గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు గా ఉంది. ఈ బైక్లో 3 కేడబ్ల్యూ, 170 ఎన్ఎం టార్క్ పవర్ అవుట్ పుట్ కూడా వస్తుంది. ఇది బైక్ పనితీరును ట్రాక్ చేయడానికి, ఛార్జింగ్ స్టేషన్‌లు, ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను నియంత్రించడానికి స్మార్ట్ ఫోన్ యాప్‌ను కూడా కలిగి ఉంది. అలాగే మార్కెట్లో ఉన్న టాప్ ఎలక్ట్రిక్ బైక్స్ లో టోర్క్ క్రాటోస్ ఆర్ బైక్ కూడా ఒకటి. కాగా ఈ బైక్ ధర రూ. 1.65లక్షలుగా ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 105 కి.మీ. ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 180 కిమీ రేంజ్ ఇస్తుంది. 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. 38 ఎన్ఎం టార్క్, 6 కేడబ్ల్యూ పవర్ అవుట్‌పుట్ వస్తుంది. కేవలం ఒక గంటలో 80% వరకు ఛార్జ్ చేయగల క్విక్ చార్జింగ్ టెక్నాలజీతో ఇది వస్తుంది.
అదేవిధంగా బడ్జెట్ ధరలో ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ బైక్స్ లో ఓబెన్ రోర్ ఆర్ బైక్ కూడా ఒకటి. ఈ బైక్ ధర రూ. 1.50లక్షలుగా ఉంది. ఇది భారతదేశంలో ఓ హై ఎండ్ ఎలక్ట్రిక్ మోటార్ బైక్. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 187 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 180 ఎన్ఎం టార్క్, 30 కేడబ్ల్యూ పవర్ అవుట్‌పుట్ ఇచ్చే 4.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీని 2 గంటల్లో 80% వరకు ఛార్జ్ చేయగల క్విక్ ఛార్జింగ్ మెకానిజంతో వస్తుంది. ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, రైడ్ ఇన్ఫర్మేషన్, బ్యాటరీ స్టేటస్, జియో-ఫెన్సింగ్, జియో ట్యాగింగ్, బ్యాటరీ చోరీ నివారణ, ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్, ఆన్ డిమాండ్ సర్వీస్, రోడ్‌సైడ్ సపోర్ట్ లాంటి అదనపు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.