Site icon HashtagU Telugu

Electric Bikes: భారత్ లో అతి వేగంగా పరుగులు పెట్టే ఎలక్ట్రిక్ బైకులు ఇవే.. ధర, ఫీచర్స్ ఇవే?

Electric Bikes

Electric Bikes

రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇందన ధరలు మండిపోతుండడంతో ఎక్కువ శాతం వాహన వినియోగ ధరలు ఎలక్ట్రిక్ వాహనాల వైఫై మగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ బైక్లు ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలైన విషయం తెలిసిందే. అయినా కూడా మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఇకపోతే భారత్ లో అత్యంత వేగంగా నడిచే ఎలక్ట్రిక్ బైక్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ జాబితాలో మొదటి పేరు హాప్-ఓక్సో ఎలక్ట్రిక్ బైక్. బైక్ కేవలం 4 సెకన్లలో 0-40 నుంచి వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. పూర్తిగా ఛార్జ్ చేస్తే 150 కి.మీల దూరం ప్రయాణించవచ్చు. దీని ధర రూ. 1.48 లక్షల ఎక్స్-షోరూమ్ గా ఉంది. తర్వాత రెండవ స్థానంలో ఒబెన్ రోహ్రర్ ఎలక్ట్రిక్ బైక్ ఉంది. ఇది కేవలం 3 సెకన్లలో గంటకు 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 100 కి.మీ. ఈ బైక్‌ ధర. రూ. 1.5 లక్షల ఎక్స్-షోరూమ్ గా ఉంది. అలాగే మూడవ స్థానంలో Tork Kratos-R బైక్ ఉంది. ఇది 3.5 సెకన్లలో 0-40 నుండి వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 101.1 కి.మీ. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను రూ. 1.78 లక్షల ఎక్స్-షోరూమ్ గా ఉంది.

తర్వాత కబీరా మొబిలిటీ KM 4000 ఎలక్ట్రిక్ బైక్ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. ఈ బైక్ కేవలం 3.2 సెకన్లలో 0-40 కి.మీ గం నుండి వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 120 కి.మీ. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను రూ. 1.69 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ జాబితాలో ఐదవ ఎలక్ట్రిక్ బైక్ ఆల్ట్రావాయిలేట్ F77 ఉంది. ఈ బైక్ కేవలం 2.9 సెకన్లలో 0-60 km/h వేగాన్ని అందుకోగలదు. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 152 km/h వరకు ఉంటుంది. ఇక చివరగా ఈ జాబితాలో ఆరోస్థానంలో Evolve Z అనేది ఎర్త్ ఎనర్జీ EV నుండి రాబోయే మరో ఎలక్ట్రిక్ బైక్. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను 2022 మధ్యలో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ 5.3 kW మోటార్ సామర్థ్యం, 96 ah లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. దీని ఛార్జింగ్ సమయం 2.5 గంటలు, దీని గరిష్ట వేగం గంటకు 95 కిమీ, 100 కిమీ పరిధిని కలిగి ఉంది. 200 కిలోల బరువు ఉంటుంది.