ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల బైక్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే అందులో కొన్ని బైక్స్ అందరికి అందుబాటులో ఉండగా మరికొన్ని బైక్స్ సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. ముఖ్యంగా వాటి ధర గురించి తెలిస్తే మాత్రం షాక్ అవ్వడం ఖాయం. మరి ఇంతకీ ఆ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్స్ బైక్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందులో టాప్ వన్ పొజిషన్ లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లలో ఒకటైన మెటోర్ 650 బైక్ ఉంది. ఈ బైక్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ బైక్ 650 అనేది 648 సీసీ పెట్రోల్ ఇంజన్ తో నడిచే క్రూయిజర్ బైక్. 47 హెచ్‌పీ పవర్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ లో కాంటెంపరరీ డిజైన్, సూపర్ వైల్డ్ ఫీచర్లు ఉండడం విశేషం. ఈ బైక్ ధర విషయానికి వస్తే.. ఈ బైక్ ధర రూ.3.78 లక్షల నుండి ప్రారంభం అవుతుంది.
ఇక ఈ బైక్స్ లో రెండవ స్థానంలో ఉంది సుజుకి హయాబుసా. కాగా ఈ బైక్ 1340 సీసీ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ తో కూడిన సూపర్ బైక్ ఇది. 190 హెచ్‌పీ పవర్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ అద్భుతమైన వేగం ఉంది. సూపర్ బైక్ డిజైన్ కలిగి ఉండడంతో వినియోగదారుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ బైక్ ధర రూ.15.1 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇకపోతే మరొక బైక్ విషయానికి వస్తే.. కవాసకి నింజా జెడ్‌ఎక్స్ 10ఆర్ టాప్ బైక్ లలో ఒకటి. ఇది సూపర్ స్పోర్ట్ బైక్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. 998 సీసీ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 200+ హెచ్‌పీ పవర్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ అత్యధిక గరిష్ట వేగం కలిగి ఉంది. అద్భుతమైన పని తీరు కనబరుస్తుంది. ఈ బైక్ ధర రూ.14.6 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
టాప్ బైక్స్ లో నాలుగో స్థానంలో ఉంది బీఎండబ్ల్యూ ఎస్1000ఆర్ బైక్. బీఎండబ్ల్యూ బైక్ లలో ఎస్1000R బైక్ కూడా ఒకటి. ఈ బైక్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ బైక్ 999 సీసీ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ తో నడిచే స్లిప్‌స్ట్రీట్ బైక్ గా గుర్తింపు పొందింది. 165+ హెచ్‌పీ పవర్ కెపాసిటీతో ఉన్న ఈ బైక్ ఫుల్ ట్యూబ్ బ్రాంచ్ టెక్నాలజీతో రూపొందించారు. పెడికాబ్ ఔటర్ రేంజ్ టెక్నాలజీతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ బైక్ ధర రూ.18.1 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ టాప్ బైక్స్ లో చివరి స్థానంలో ఉన్న బైక్ డుకాటీ పనిజెలి వీ4. ఈ బైక్ 1103సీసీ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌తో నడిచే సూపర్ స్పోర్ట్ బైక్‌గా గుర్తింపు పొందింది. 214 హెచ్‌పీ పవర్ కెపాసిటీ కలిగి ఉంది. ఈ బైక్ ప్రీమియం డిజైన్, డిటైలింగ్ ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. ఈ బైక్ ధర రూ.24.8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.