ప్రస్తుతం భారత మార్కెట్ లో ఎన్నో రకాల స్కూటర్లు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. వివిధ కంపెనీలకు చెందిన స్కూటర్లు మార్కెట్లో రాణిస్తున్నాయి. ఒకదానిని మించి ఒకటి పోటీ పడుతూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల అయిన వాటితో పాటుగా కొత్త కొత్త స్కూటర్లు మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. అలాగే ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేస్తున్న స్కూటర్లలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేయడంతో పాటుగా వాటికి పోటీగా మరికొన్ని స్కూటర్లను తీసుకు వస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మార్కెట్లో రకరకాల స్కూటర్లు ఉండగా అందులో ముఖ్యంగా టాప్ ఫైవ్ స్కూటర్లు ఎక్కువగా అమ్ముడు అవుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరి మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న ఆ టాప్ ఫైవ్ స్కూటర్లు ఏవో, వాటి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హోండా యాక్టివా 2024 జులైలో దాదాపుగా 1,95,604 యూనిట్లను విక్రయించినట్లు తెలీపింది. కాగా ఈ హోండా యాక్టివా స్కూటర్ ధర రూ. 76,684 నుండి ప్రారంభమవుతుంది. అదేవిధంగా 2024 జులైలో టీవీఎస్ జూపిటర్ 74,663 యూనిట్లు విక్రయాలు జరిగాయి. ఈ స్కూటర్ ధర రూ. 73,700 నుండి ప్రారంభమవుతుంది. కేవలం ధర విషయంలో మాత్రమే కాకుండా ఫీచర్స్ విషయంలో కూడా ఈ స్కూటర్ ఎక్కువగా ఆకట్టుకుంటోంది.
అలాగే సుజుకి యాక్సెస్ కూడా జులై నెలలో 71,247 యూనిట్లు విక్రయాలు జరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఇకపోతే ఈ సుజుకి యాక్సెస్ స్కూటర్ ధర విషయానికి వస్తే.. దీని ధర రూ. 79,899 నుండి ప్రారంభమవుతుంది. అలాగే ఈ ఏడాది జూలై నెలలో హోండా డియో 33,447 యూనిట్లు విక్రయించినట్లు తెలిపింది. కాగా ఈ 110 సిసి స్కూటర్ ధర రూ. 70,211 నుండి ప్రారంభమవుతుందట. టీవీఎస్ Ntorq జూలై 2024లో 26,829 యూనిట్లను విక్రయించింది. ఈ 125 సీసీ స్కూటర్ ధర రూ. 89,641, నుండి ప్రారంభమవుతుంది.