Site icon HashtagU Telugu

Car Safety: ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు.. ఎలాంటి దొంగ అయినా మీ కారు దొంగలించలేడు?

Car Safety

Car Safety

రోజురోజుకి ఈ టెక్నాలజీ డెవలప్ అవుతుండడంతో దొంగతనాలు చేసే దొంగలు కూడా మరింత డెవలప్ అవుతూ కొత్త కొత్త ప్లాన్లు చేస్తూ పోలీసులు సైతం ఆశ్చర్యపోయే విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. మనం మన వస్తువుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి వాటిలో కారు దొంగతనం కూడా ఒకటి. కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా కారు దొంగతనం జరగవచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోయే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి దొంగ అయినా సరే మీ కారుని దొంగలించలేడట.

ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటి అన్న విషయానికి వస్తే.. ఎప్పుడైనా సరే కారు తాళం చెవిలను కారు లోపల కాకుండా సురక్షితమైన ప్రదేశంలో ఉంచడం మంచిది. మన దగ్గర ఎక్సట్రా కీ పెట్టుకోవడం వల్ల మన కారు కీస్ పోగొట్టుకుపోయిన లేదంటే మరిచిపోయిన కూడా ఆ ఎక్స్ ట్రా కీస్ ఉపయోగపడతాయి. అలాగే కారు లోపల విలువైన వస్తువులను ఉంచవద్దు. కారులో విలువైన వస్తువులు ఉంటే దొంగలు ఆకర్షితులవుతారు. కారులో ఎలాంటి వస్తువులు పెట్టవద్దు. ఏవైనా ఖరీదైన వస్తువులు కనిపిస్తే చాలు వెంటనే ఆ కారు అద్దాలు ధ్వంసం చేసి అయినా సరే వారిని తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కారు కొన్న వెంటనే జీపీఎస్‌ ట్రాకర్‌ను ఏర్పాటు చేసుకోవాలి.

జీపీఎస్‌ ట్రాకర్‌ ఉంటే కారు దొంగతనానికి గురయిన వెంటనే వెతికి పట్టుకోవచ్చు. మీ కారుకు వెంటనే జీపీఎస్‌ ట్రాకింగ్ పరికరాన్ని అమర్చుకోవడం మంచిది. అలాగే టైర్ కు తాళం వేసుకోవడం కూడా మంచిది. ఇది చాలామందికి కాస్త ఫన్నీగా అనిపించినప్పటికీ జాగ్రత్త కోసం ఇలా చేయక తప్పదు అని అంటున్నారు. కార్ టైర్ కు తాళం వేస్తే ఒకవేళ దొంగతనం చేయాలి అనుకున్న కూడా కారు ముందుకు కదలదు. స్టీరింగ్ వీల్ లాక్ ని ఉపయోగించడం వల్ల, కారు దొంగతనం చేయడం వీలు కాదు. అలాగే ఎల్లప్పుడూ సురక్షిత ప్రాంతాల లోనే కారును పార్క్ చేయాలి. బాగా వెలుతురు ఉన్న ప్రదేశాల్లో పార్కింగ్‌కు ఎంచుకోవాలని చెబుతున్నారు. ఒకటికి రెండు సార్లు కారు లాక్ చెక్‌ చేసుకోవాలి. తప్పనిసరిగా కారును లాక్‌ చేయాలి. తెలిసిన ప్రదేశాలలో పార్క్ చేసినప్పటికీ ఎప్పుడూ అద్దాలు, డోర్‌లను లాక్ చేయడం పరిశీలించాలని హెచ్చరిస్తున్నారు.