Car Tips: వర్షాకాలంలో మీ కారు ట్రబుల్ ఇవ్వకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నగర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో జలమయం అవ్వడంతో పాటు రోడ్లమీదకి పెద్ద ఎత్

Published By: HashtagU Telugu Desk
Mixcollage 29 Jun 2024 09 08 Pm 8453

Mixcollage 29 Jun 2024 09 08 Pm 8453

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నగర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో జలమయం అవ్వడంతో పాటు రోడ్లమీదకి పెద్ద ఎత్తున నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా వర్షాలు పడినప్పుడు వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వరద ప్రాంతాల్లో ఇలా వాహనాలు ఆగిపోతే ఊహించని ప్రమాదాలు జరగవచ్చు. అలాంటప్పుడు మనం కారు ట్రబుల్ ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో,ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భారీ వర్షం కారణంగా నీట మునిగిన బేస్​మెంట్ పార్కింగ్ ఉంటే, మీ కారు ఇంజిన్​పై మీ మొదటి శ్రద్ధ అవసరం. వరదలు వంటి పరిస్థితులు కారు ఇంజిన్​ను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందువల్ల నీరు తగ్గిన వెంటనే ఇగ్నీషన్ ఆన్ చేయాలి. లేదా మెకానిక్​ను పిలిచి ఎంత మేర నష్టం జరిగింది, అన్నది కచ్చితంగా తెలుసుకోవాలి. కారును స్టార్ట్ చేసే ప్రయత్నాలకు కూడా నీటి ప్రవాహం ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా చాలాసార్లు ఇంజిన్​ని స్టార్ట్​ చేయడానికి ప్రయత్నిసారు! కానీ అలా అస్సలు చేయకండి. ఒకవేళ చేస్తే సిలిండర్ వాల్​, పిస్టన్, కనెక్టింగ్ రాడ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. అదేవిధంగా కార్ టైర్లను ఎప్పటికప్పుడు చెక్​ చేస్తూ ఉండాలి.

అవి సరిగ్గా లేకపోతే బండి స్కిడ్​ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రమాదానికి దారి తీయవచ్చు. ఇది ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా జరుగుతుంది. టైర్లను నిర్దిష్ట ప్రెజర్​కు అనుగుణంగా ఉంచాలి. ట్రెడ్లను కూడా గమనించాలి. ఒకవేళ ట్రెడ్​ల మధ్య ట్రెడ్ ఇండికేటర్లు కనిపిస్తే, యజమాని తప్పనిసరిగా టైర్లను మార్చాలి. సీజన్​ ఏదైనా, కారులో బ్రేకుల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వర్షాకాలంలో దీని పట్ల ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాలి. అందువల్ల, బ్రేక్ ఫ్లూయిడ్​ను సరైన స్థాయిలో ఉంచడానికి దానిని చెక్ చేయాలి.

బ్రేక్ ప్యాడ్​లు, డిస్క్​లను చెక్ చేయడం కోసం టెక్నీషియన్​ని కూడా సంప్రదించాలి. ఒకవేళ ప్యాడ్ లు అరిగిపోయినట్లయితే వాటిని మార్చాల్సి ఉంటుంది. లైట్లు, ఇండికేటర్​లను చెక్​ చేయాలి. వాటర్ లాగింగ్ తరచుగా హెడ్​లైట్​లు, టెయిల్​లైట్​లు లేదా ఇండికేటర్​లలో లోపాన్ని సృష్టిస్తుంది. తరచుగా కారు యజమానులు సరిగ్గా పనిచేసే హెడ్​లైట్ లేదా ఇండికేటర్ లేకుండా తమ వాహనాలను నడుపుతూనే ఉంటారు. భారీ వర్షంలో ఇది చాలా ప్రమాదకరం! తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది. అందువల్ల, హెడ్​లైట్​లు, టెయిల్​లైట్​లు, ఇండికేటర్ లు, హజార్డ్ లైట్​లను ఎప్పటికప్పుడు చెక్​ చేయండి.

  Last Updated: 29 Jun 2024, 09:09 PM IST