Site icon HashtagU Telugu

Thunderbolt: థండర్ బోల్ట్ ఎలక్ట్రిక్ బైక్ అదుర్స్ 110 కి.మీ రేంజ్

Thunderbolt Electric Bike Offers A Range Of 110 Km

Thunderbolt Electric Bike Offers A Range Of 110 Km

మీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయాలనే ప్లానింగ్‌లో ఉన్నారా? పెట్రోల్ ఖర్చు లేకుండా ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా? అయితే మీకు మార్కెట్‌లో పలు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మనం ఇప్పుడు జాయ్ ఇబైక్ అందిస్తున్న ఎలక్ట్రిక్ బైక్ గురించి తెలుసుకోబోతున్నాం. దీని పేరు థండర్‌బోల్ట్ (Thunderbolt). ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో పలు అదిరిపోయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ స్పీడ్, ఎక్కువ రేంజ్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు. జాయ్ థండర్‌బోల్డ్ (Thunderbolt) ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. ఇందులో కంపెనీ 5000 వాట్ మోటార్ అమర్చింది. దీని టార్క్ 230 ఎన్ఎం. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ బైక్ 110 కిలోమీటర్ల వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది.

ఇంకా ఈ ఇబైక్‌లో ఐఓటీ సెన్సార్స్ ఉన్నాయి. దొంగలు ఈ బైక్‌ను తస్కరించలేరు. బైక్ లొకెషన్ ట్రాక్ చేయొచ్చు. మొబైల్ అప్లికేషన్ ద్వారా మీరు మీ బైక్ లొకేషన్ తెలుసుకోవచ్చు. ఎక్కడ ఉందో ఈజీగా తెలుస్తుంది. కేవలం 40 పైసలు ఖర్చుతో కిలోమీటర్ వెళ్లొచ్చని కంపెనీ పేర్కొంటోంది. కేవలం 6 యూనిట్ల కరెంట్‌తో బ్యాటరీ ఫుల్ అవుతుందని కంపెనీ పేర్కొంటోంది. అంటే తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ముందు భాగంలో, వెనుక భాగంలో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. 10 ఏఎంపీ స్మార్ట్ చార్జర్ ఉంది. ఓవర్ వోల్టేజ్, టెంపరేచర్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ వంటివి లభిస్తున్నాయి.

హైడ్రాలిక సస్పెన్షన్ ఉంది. ఇంకా ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో కంపెనీ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ 150 కేజీల వరకు బరువును లాగగలదు. ఇందులో డీసీ బ్రష్‌లెస్ హబ్ మోటార్‌ను అమర్చారు. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలని భావించే వారు కంపెనీ వెబ్‌సైట్లోకి వెళ్లి ఇబైక్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర విషయానికి వస్తే.. దీని రేటు రూ.2.3 లక్షలుగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే రేటు ఎక్కువనే చెప్పాలి.

ఇకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసే వారు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. బ్యాటరీ కాస్ట్ ఎంతనో ముందే చెక్ చేసుకోవాల. ఎందుకంటే మీరు కొత్త బ్యాటరీ కోసం రూ. వేలకు వేలు పెట్టాలంటే కష్టం అవుతుంది. అందుకే మీరు ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ప్యాక్ ఎంతనో ముందే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ధరతో మీరు కొత్త ఓలా స్కూటర్ కొనుగోలు చేయొచ్చు. అందుకే ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.

Also Read:  IAS vs IPS: ఇద్దరి అధికారిణుల జగడాని సినిమాగా రూపొందేందుకు ప్లాన్ చేస్తున్న నిర్మాతలు.