Site icon HashtagU Telugu

Modifying Car Be Alert : కారును ఇలా మోడిఫై చేశారో.. అంతే సంగతి!

Modifying Car Be Alert

Modifying Car Be Alert

కారును స్టైలిష్ గా మోడిఫై చేద్దామని(Modifying Car Be Alert) అనుకుంటున్నారా ?

అయితే ఓకే .. కానీ షరతులు వర్తిస్తాయి అని చట్టాలు చెబుతున్నాయి. 

మీరు ఇష్టం వచ్చినట్టు కారును మోడిఫై చేస్తే పోలీసులు అడ్డుకోవడమైతే ఖాయం.. 

మీ కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లో పేర్కొన్న వాహనం బరువులో 2 శాతానికి మించని యాక్సెసరీస్ మాత్రం మోడిఫికేషన్ లో వాడాలి. 

1988 మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 52కు 2000, 2019 సంవత్సరాల్లో చేసిన సవరణల ప్రకారం కారు ప్రాథమిక నిర్మాణాన్ని మార్చేలా ఉండే మోడిఫికేషన్స్ ను చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. 

బుల్ బార్‌లు..

కారులో చేసిన అధిక మార్పులు(Modifying Car Be Alert) మీకు , మీ కారుకు హానికరం. మీరు కారులో అలాంటి మార్పులు చేసి ఉంటే, భారీ చలాన్‌కు సిద్ధంగా ఉండాలి. కారులో మోడిఫికేషన్స్ చేయడం తప్పేం కాదు.. కానీ మితిమీరిన మార్పులు చేయడం చట్ట విరుద్ధం. కొన్నేళ్ల క్రితం బుల్ బార్‌లతో కూడిన కార్లపై పెద్ద ఎత్తున రైడ్స్ జరిగాయి. జప్తు చేసిన బుల్ బార్‌లపై అప్పట్లో పోలీసులు  రోడ్ రోలర్‌లను ఎక్కించారు. మీ కారులో బుల్ బార్‌లు ఉంటే..  పోలీసుల నుంచి చలాన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. రోడ్డు ప్రమాదంలో బుల్‌బార్‌లు క్రాష్ అయినప్పుడు..  ఎయిర్‌బ్యాగ్ సెన్సర్‌లకు ఆటంకం కలుగుతుందని అంటారు. అదే జరిగితే.. ప్రమాదం జరిగిన సందర్భాల్లో వాహనంలో ఉన్నవాళ్ల ప్రాణాలకు ఇబ్బంది కలుగుతుంది.

అదనపు లైట్లు

అదనపు లైట్లు అమర్చిన కార్లు ప్రమాదకరం. రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు.. ఇవి ఎక్స్ ట్రా  లైటింగ్ తో ఇతర వాహనాలకు ప్రమాదాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది.  అదనపు లైట్ల కాంతి.. ఎదురుగా వచ్చే వాహనాల డ్రైవర్ల దృష్టిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ఆ డ్రైవర్ వాహనంపై అదుపు కోల్పోయి యాక్సిడెంట్ జరిగే ముప్పు పొంచి ఉంటుంది.

Also read : Business Ideas: విదేశాల్లో అత్యంత డిమాండ్ ఉన్న పంట ఇదే.. ఈ సాగు చేస్తే రైతులు లక్షాధికారులు కావొచ్చు..!

భారీ టైర్లు,  చక్రాలు

పరిమితికి మించిన సైజున్న  టైర్లను కార్లలో వాడటం ప్రమాదకరం. ఇవి రోడ్డుపై ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందికి కలిగిస్తాయి. అందుకే అలా మోడిఫై చేసిన కార్లపై  పోలీసులు భారీ జరిమానా విధిస్తారు. ముఖ్యంగా కేరళ వంటి రాష్ట్రాల్లో ఓవర్‌సైజ్డ్ టైర్లు , వీల్స్ వాడే వాహనాల విషయంలో కఠినమైన నియమాలు ఉన్నాయి.

ఎయిర్ హార్న్‌లు

ఎయిర్ హార్న్‌ల సౌండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇతర వాహనదారుల చెవులకు ఇబ్బంది కలిగిస్తాయి. ఎయిర్ హార్న్‌లు వాడటం చట్టవిరుద్ధం.. వీటిని కలిగి ఉన్న కార్లకు భారీగా జరిమానా విధిస్తారు.