Site icon HashtagU Telugu

Buy New Car: మార్చిలో కొత్త కారు కొనాలంటే ఈ మూడు రోజులే బెస్ట్‌.. సాలిడ్ రీజ‌న్ కూడా ఉంది!

Buy New Car

Buy New Car

Buy New Car: మార్చి నెల నడుస్తోంది. కొత్త కారు కొనుగోలు చేసే వారికి ఇదో చక్కటి అవకాశం. కొన్ని కార‌ణాల వ‌ల‌న‌ కార్ డీలర్లు వాహనాల పాత స్టాక్‌ను క్లియర్ చేయాల్సి వ‌స్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్ల కంపెనీలు, డీలర్లు కలిసి కొత్త ఆఫర్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. మీరు ఈ నెలలో కొత్త కారును (Buy New Car) కొనుగోలు చేయబోతున్నట్లయితే ఈ అవకాశం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.మీరు ఈ నెల 29, 30, 31 తేదీల్లో కొత్త కారును కొనుగోలు చేస్తే, మీరు చాలా ప్రయోజనం పొందవచ్చు. భారీగా ప్ర‌యోజ‌నం అవ‌కాశం కూడా ఉంది.

కారు కొనడానికి సరైన సమయం

ఈ నెల 29, 30, 31 తేదీల్లో మీరు కారు కొనుగోలు చేస్తే కారు డీలర్లు మీకు మంచి తగ్గింపు ఇవ్వగలరు. వాస్తవానికి మార్చి నెల ముగింపు నెల. విక్రయ లక్ష్యాలను చేరుకోవడానికి వినియోగదారులకు ఉత్తమ ఆఫర్‌లు, తగ్గింపులు అందిస్తారు. మీరు గత సంవత్సరం మోడ‌ల్ వాహనాన్ని మంచి తగ్గింపుతో పొందుతున్నట్లయితే వెంటనే డీల్‌ను లాక్ చేసుకోండి.

Also Read: Nitish Reddy: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ న్యూస్.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

పాత స్టాక్‌ను క్లియర్ చేయమని కార్ డీలర్లపై ఇప్పటికీ చాలా ఒత్తిడి ఉన్న‌ట్లు స‌మాచారం. గత సంవత్సరం చాలా స్టాక్ మిగిలి ఉంది. అది ఇప్పటికీ విక్రయించలేక‌పోయారు. కొన్ని బ్రాండ్ల ఉత్పత్తి సక్రమంగా ఉండగా కొన్ని కార్ కంపెనీలు కూడా ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. పాత నిల్వలు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో కార్ కంపెనీలు తమ పాత స్టాక్‌లను డిస్కౌంట్ల ద్వారా క్లియర్ చేస్తున్నాయి.

నెలాఖరుకు కొనుగోలు చేయడంలో ప్రయోజనం కూడా ఉంది. ఎందుకంటే సేల్స్ టీమ్ స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఒత్తిడికి గురవుతుంది. వారు వాహనాలను చాలా తక్కువ ధరలకు విక్రయించవలసి వస్తుంది.

అదనపు తగ్గింపు కోసం మాట్లాడుకోవ‌చ్చు

కొత్త కారుపై బెస్ట్ ఆఫర్ కోసం డీలర్‌తో మాట్లాడండి. ఒకేసారి అంగీకరించకుండా కొంత సమయం తీసుకొని మాట్లాడండి. అంతే కాకుండా మీరు అదనపు తగ్గింపులు లేదా ఉపకరణాల గురించి మాట్లాడవచ్చు. ప్రారంభంలో సేల్స్‌మ్యాన్ మిమ్మల్ని క‌న్వీన్స్ చేయాలని చూస్తాడు. ప్రస్తుతం మారుతీ సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్, MG వంటి కార్ కంపెనీలు చాలా మంచి తగ్గింపులను అందిస్తున్నాయి.