Site icon HashtagU Telugu

Comfortable Bikes: ఈ బైక్‌లలో అత్యంత సౌకర్యవంతమైన సీట్లు.. ధర కూడా మీ బడ్జెట్‌లోనే!

Comfortable Bikes

Comfortable Bikes

Comfortable Bikes: దేశంలో 100సీసీ నుంచి 125సీసీ ఇంజన్లు కలిగిన బైక్‌ల మార్కెట్ చాలా పెద్దది. అనేక మంచి ఎంపికలు (Comfortable Bikes) ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ అవసరాన్ని బట్టి మోడల్‌ను ఎంచుకోవచ్చు. కానీ మీరు సౌకర్యవంతమైన సీటును పొందే, ఎక్కువ దూరాలకు అలసిపోని బైక్ కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ మేము మీకు ప్రయోజనకరంగా ఉండే మూడు ఉత్తమ ఎంపికల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము.

బజాజ్ ఫ్రీడమ్
ఇంజిన్: 125cc
ధర: రూ. 1.10 లక్షల నుండి

బజాజ్ ఫ్రీడమ్ ఒక సరసమైన పెట్రోల్, CNG పవర్డ్ బైక్. దీని ధర రూ.1.10 లక్షల నుంచి మొదలవుతుంది. బైక్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. కానీ దాని పొడవైన, సౌకర్యవంతమైన సీటు దాని అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇది 125cc ఇంజన్ కలిగి ఉంది. ఇది 9.5 PS పవర్, 9.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్ సౌకర్యం ఉంది. CNG+ పెట్రోల్‌తో పనిచేసే ఏకైక ఇంజన్ ఇదే. కంపెనీ ప్రకారం.. ఫ్రీడమ్ 125లో 2 లీటర్ ఇంధన ట్యాంక్, 2 కిలోల CNG సిలిండర్ ఉంది. రైడర్ల సౌలభ్యం కోసం ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ స్పీడోమీటర్, హ్యాండిల్‌బార్‌పై CNG, పెట్రోల్ షిఫ్ట్ బటన్, USB పోర్ట్, పొడవైన సీటు, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ వంటి ఫీచర్లతో కూడా అందించబడింది.

Also Read: Dreams: మీకు ఈ స‌మ‌యంలో క‌ల‌లు వ‌స్తున్నాయా?

హోండా షైన్ 100
ఇంజిన్: 100cc
ధర: రూ. 66,900

హోండా షైన్ 100 చాలా పొదుపుగా ఉండే బైక్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.66,900. ఈ బైక్ సీటు మృదువైనది. పొడవుగా ఉంటుంది. ఈ బైక్ ఎలాంటి రోడ్లపై అయినా సులభంగా ప్రయాణించగలదు. ఇది కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌తో అమర్చబడి ఉంటుంది. దీని వలన మంచి బ్రేకింగ్ అందించబడుతుంది. బైక్ డిజైన్ సులభం. ఇంజన్ గురించి చెప్పాలంటే.. ఈ బైక్ 98.98 cc ఇంజన్ కలిగి ఉంది. ఇది 5.43 kW పవర్, 8.05 Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ బైక్ ఒక లీటర్‌లో 65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

TVS రైడర్ 125
ఇంజిన్: 125cc
ధర: రూ. 85,000 నుండి

TVS రైడర్ 125 శక్తివంతమైన, సౌకర్యవంతమైన బైక్. ఈ బైక్‌లో అందించిన సీటు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని నడుపుతున్నప్పుడు త్వరగా అలసిపోరు. మీరు ఎక్కువసేపు దాని రైడ్‌ను ఆస్వాదించవచ్చు. బైక్‌లో అమర్చిన 124.8 సిసి ఇంజన్ 8.37 కిలోవాట్ల శక్తిని, 11.2 ఎన్ఎమ్‌ల టార్క్‌ను అందిస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్ సౌకర్యం ఉంది. బైక్ రెండు టైర్లకు 17 అంగుళాల టైర్లను అమర్చారు. ఇందులో ముందువైపు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, వెనుకవైపు 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ సదుపాయం ఉంది. ఇది 5-అంగుళాల TFT క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. బైక్ డిజైన్ దాని విభాగంలో అత్యంత స్మార్ట్, స్టైలిష్‌గా ఉంది. బైక్ ధర రూ.85 వేల నుంచి మొదలవుతుంది.