New SUV Cars in 2024 : అద్భుతమైన ఫీచర్లతో 2024 లో మార్కెట్ లోకి రాబోతున్న SUV కార్స్ ఇవే?

సబ్‌కాంపాక్ట్ SUVలు, బలమైన ట్రెడిషనల్ SUVల కంటే చిన్నవిగా ఉంటాయి. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.

  • Written By:
  • Publish Date - December 7, 2023 / 06:40 PM IST

Launch of New SUV Cars in  2024 : ప్రస్తుత రోజుల్లో కార్ల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఇదివరకటి రోజుల్లో కారు అంటే చాలామంది వామ్మో అనేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం ప్రతి పదిమందిలో ఎనిమిది మంది కార్లను ఉపయోగిస్తున్నారు. అయితే వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆయా సంస్థలు కూడా కొత్త కొత్త ఫీచర్లు అధునాతన ఫీచర్లతో అనేక రకాల కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పాపులర్ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలను రిలీజ్ చేసేందుకు ప్రముఖ కంపెనీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. సబ్‌కాంపాక్ట్ SUVలు, బలమైన ట్రెడిషనల్ SUVల కంటే చిన్నవిగా ఉంటాయి. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. అయితే మంచి స్పేస్, యుటిలిటీని అందించే వెహికల్స్‌గా ఇవి గుర్తింపు పొందాయి. మరి 2024లో ఈ సెగ్మెంట్‌లో లాంచ్ కానున్న కార్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

టాటా పంచ్ ఈవీ.. టాటా మోటార్స్ పంచ్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను రూపొందిస్తున్నట్లు 2021లోనే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఎలక్ట్రిక్ SUV ప్రోటో టైప్స్‌ను అనేక సందర్భాలలో మన రోడ్లపై గుర్తించారు. కానీ ఈ కారు మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. అయితే వచ్చే ఏడాది అనగా 2024లో టాటా మోటార్స్ పంచ్ ఈవీ ని విడుదల చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం. ఈ వెహికల్ 30kWh బ్యాటరీతో రావచ్చు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపుగా 300 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.

మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్.. ఈ మోడల్ 2018 లో మొదటి సారి లాంచ్ అయింది. తర్వాత దీనికి కంపెనీ మైనర్ స్టైలింగ్ మార్పులు, ఫీచర్లను యాడ్ చేసి పవర్‌ఫుల్ XUV300 స్పోర్ట్‌ని పరిచయం చేసింది. అంతకు మించిన పెద్ద అప్‌గ్రేడ్స్ మాత్రం రాలేదు. అయితే మహీంద్రా కంపెనీ త్వరలో XUV300కి మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్‌ను పరిచయం చేయనుంది. దీని టెస్ట్ యూనిట్లను ఇప్పటికే గుర్తించారు. ఫేస్‌లిఫ్టెడ్ XUV300 అప్‌గ్రేడ్స్, లాంచింగ్ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్.. 2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్ ఈ డిసెంబర్‌లోనే మార్కెట్‌లోకి రావచ్చని అంచనా వేస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. 2020లో లాంచ్ అయిన కియా సోనెట్ సబ్‌కాంపాక్ట్ SUVకి ఇది మొదటి అప్‌డేటెడ్ వెర్షన్‌గా రానుంది. ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ వివిధ రకాల అప్‌గ్రేడ్స్‌తో రిలీజ్ కానుంది. ఫ్రంట్ ఫాసియా నుంచి ట్వీక్ చేసిన ఎక్స్‌టీరియర్స్, రీవర్క్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌లైట్ లేఅవుట్, రీడిజైన్డ్ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఫాగ్ ల్యాంప్స్ వంటి స్పెసిఫికేషన్లతో కొత్త కియా సోనెట్ కస్టమర్లను ఆకట్టుకోనుంది.

హోండా సబ్ కాంపాక్ట్ SUV.. హోండా కంపెనీ ఒక సరికొత్త సబ్‌కాంపాక్ట్ SUVతో భారతదేశంలో SUV లైనప్‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయం గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఇటీవల ఎలివేట్‌ వెహికల్‌ను లాంచ్ చేసిన ఈ బ్రాండ్, సబ్-4 మీటర్ SUVని విడుదల చేయాలని చూస్తోంది. అయితే ఈ రాబోయే SUVకి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. వచ్చే ఏడాది కొత్త వెహికల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టయోటా టైసర్.. ఈ టయోటా బ్రాండ్ టైసర్ అనే కొత్త క్రాసోవర్‌తో సబ్-4 మీటర్ SUV విభాగంలోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. ఇది మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎడిషన్‌కు రీబ్యాడ్జ్డ్ మోడల్ అని విశ్లేషణలు ఉన్నాయి. టయోటా టైసర్, ఫ్రాంక్స్ మాదిరిగానే అదే స్పెక్స్, ఫీచర్లతో రావచ్చు. లోగో, బ్యాడ్జ్‌ తప్ప ఇతర విజువల్ ఎలిమెంట్స్ కొత్త వెహికల్‌లో కంటిన్యూ అవుతాయి.

Also Read:  Lemon for skin: నిమ్మరసంలో అది కలిపి రాస్తే చాలు మీ ముఖం ప్రశాంతంగా వెలిగిపోవాల్సిందే?