Site icon HashtagU Telugu

Royal Enfield Bikes : వచ్చే ఏడాది మార్కెట్ లోకి రాబోతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్ ఇవే?

These Are The Royal Enfield Bikes Coming To The Market Next Year..

These Are The Royal Enfield Bikes Coming To The Market Next Year..

Upcoming Royal Enfield Bikes in 2024 : ద్విచక్ర వాహన వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే వాటిలో ఎన్‌ఫీల్డ్‌ బైక్స్ కూడా ఒకటి. ఈ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్ కి మార్కెట్ లో ఏ రేంజ్ లో క్రేజ్ డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల బైకులను మార్కెట్లోకి విడుదల చేసింది. వాటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త బైక్ స్కిన్ మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది ఎన్‌ఫీల్డ్‌ సంస్థ. ఇక అందులో భాగంగానే వచ్చే ఏడాది మరిన్ని కొత్త మోడల్స్ కలిగిన బైక్స్ ని మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. ముఖ్యంగా 650 సీసీ సెగ్మెంట్‌ పై కంపెనీ దృష్టి సారించనుంది. మరోవైపు తన మొదటి విద్యుత్‌ వాహనాన్నీ తీసుకొచ్చేందుకు కూడా సన్నద్ధమవుతోంది. ఇంతకీ మరి వచ్చే ఏడాది మార్కెట్లోకి రాబోతున్న ఆ బైక్స్ ఏవి అన్న విషయానికి వస్తే..

షాట్‌గన్‌ 650.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 మోటోవెర్స్‌ ఎడిషన్‌ బైక్‌ ను ఇటీవల విడుదల చేసింది. లిమిటెడ్‌ ఎడిషన్‌గా తీసుకొస్తున్న ఈ స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.4.25 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. అయితే వచ్చే ఏడాది నుంచి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయనుంది. 650cc సెగ్మెంట్‌ లో కంపెనీ తీసుకురానున్న నాలుగో బైక్ ఇది. నావిగేషన్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ముందు, వెనుక డిస్క్‌ బ్రేక్స్‌, డ్యుయల్‌-ఛానల్ ABS కూడా ఉంది.

స్క్రాంబ్లర్‌ 650..650సీసీ ఇంజిన్‌ సెగ్మెంట్‌లో రాయల్‌ ఎన్ఫీల్డ్‌ (Royal Enfield) తీసుకొస్తున్న ఐదో మోటార్‌ సైకిల్‌ స్క్రాంబ్లర్‌ 650. అయితే ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్‌ చేసిన ఈ బైక్‌ని వచ్చే ఏడాది చివరి నాటికి మార్కెట్‌ లోకి తీసుకొని రావాలని కంపెనీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. స్పోక్స్‌ వీల్స్‌, డ్యుయల్‌ రియర్‌ షాక్స్‌, డ్యుయల్‌ పర్పస్‌ టైర్లతో ఈ వాహనం రానుంది. స్క్రామ్ 450…రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మరో ద్విచక్ర వాహనం స్క్రామ్‌ 450. హిమాలయన్‌ మాదిరిగానే 40-హార్స్‌ పవర్ లిక్విడ్ కూల్డ్‌ ఇంజిన్‌తో ఈ మోటార్‌ సైకిల్‌ రానుంది. ఈ బైక్ కి సంబంధించింది ఫీచర్ల వివరాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది.

క్లాసిక్‌ 650.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఇప్పటికే తీసుకొచ్చిన క్లాసిక్‌ 350 ద్విచక్ర వాహనం ఆదరణ పొందుతోంది. అదే పేరుతో 650సీసీ ఇంజిన్‌తో కొత్త వాహనాన్ని తీసుకురానుంది. అదే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 650 ఇప్పటికే ఈ బైక్‌ టెస్టింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ బైక్‌ కూడా వచ్చే సంవత్సరంలోనే తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. వీటితో పాటుగా ఎంతో కాలంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి వచ్చే ఎలక్ట్రిక్‌ వాహనం కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు ఎన్‌ఫీల్డ్‌ బైక్ లవర్స్. ఈ ఏడాది జరిగిన EICMA ఈవెంట్‌లో కంపెనీ తన మొదటి విద్యుత్ మోటార్‌ సైకిల్‌ ఎలక్ట్రిక్‌ హిమాలయన్‌ నమూనాను ఆవిష్కరించింది. అయితే ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ అడ్వెంచర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ను 2025 నాటికి మార్కెట్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:  Paneer Fried Rice: రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రైడ్ రైస్.. ఇంట్లోనే చేసుకోండిలా?