MUV Vehicles : ఆగస్టు నెలలో దుమ్ము దులిపే సేల్స్ సాధించిన MUV కార్స్ ఇవే…!!

భారత్ లో ఈ  మధ్యకాలంలో మల్టీపర్సప్ వెహికల్స్..మల్టీ యుటిలిటీ వెహికల్స్ కు డిమాండ్ భారీగా పెరుగుతోంది.

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 06:00 PM IST

భారత్ లో ఈ  మధ్యకాలంలో మల్టీపర్సప్ వెహికల్స్..మల్టీ యుటిలిటీ వెహికల్స్ కు డిమాండ్ భారీగా పెరుగుతోంది. వాటి పెరుగుదలలో గణనీయమైన వ్రుద్ధి సాధించాయి. ఈ మూడు వాహనాలకు ఆగస్టు నెలలో అత్యధికంగా డిమాండ్ ఏర్పడింది. ఆగస్టు నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎంయూవీ వాహనాలేవో తెలుసుకుందాం.

మారుతీ సుజుకి ఎర్టిగా:
మారుతి సుజుకి ఎర్టిగా గత నెలలో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న MUV వాహనాల లిస్టులో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మోడల్ కంపెనీ ఏడాది క్రితమే లాంచ్ చేసింది. ఎర్టిగా దాని స్వంత సీటింగ్ కాన్ఫిగరేషన్, రెండు మూడవ వరుస సీటింగ్, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉంది. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఆగస్టు 2022లో, కంపెనీ మొత్తం 9,314 Ybnvitలను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే మొత్తం 6,215 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో 49 శాతం పెరుగుదల కనిపించింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా:
టయోటా ఇన్నోవా క్రిస్టా వాహనాల లిస్టులో రెండవ స్థానంలో నిలిచింది. దీన్ని కంపెనీ 2005 ప్రారంభించినప్పటి నుండి ఇన్నోవా, ఇన్నోవా క్రిస్టాలను వేగంగా అమ్ముడపోతున్నాయి. ఆగస్ట్ 2022లో, టయోటా ఇన్నోవా క్రిస్టా 6,036 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఆగస్టు 2021తో పోల్చితే, కంపెనీ మొత్తం 5,755 యూనిట్లను విక్రయించింది.

కియా కేరెన్స్:
కియా కేరెన్స్ మూడవ స్థానంలో ఉంది. కియా మోటార్స్ భారత్ లో అత్యంత ప్రజాదారణ పొందింది. కియా కారెన్స్ అనేది సెల్టోస్, సొనెట్‌లతో వేగవంతమైన వృద్ధిని నమోదు చేసుకుంది. ఆగస్టు 2022లో, కియా కేరెన్స్ 5,558 యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో, కేరెన్స్ భారత్ లో కొత్త మోడల్ అయినందున, దాని YoY పెరుగుదలను పోల్చి చెప్పలేము.