Site icon HashtagU Telugu

New EV Scooters: త్వరలోనే మార్కెట్ లోకి రాబోతున్న ఈవీ స్కూటర్లు ఇవే.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

Mixcollage 05 Dec 2023 01 54 Pm 7096

Mixcollage 05 Dec 2023 01 54 Pm 7096

దేశవ్యాప్తంగా రోజు రోజుకీ ద్విచక్ర వాహన వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో వాహన తయారీ సంస్థలు కూడా అందుకు అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ ఫీచర్స్ కలిగిన బైకులను స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ప్రతి ఏడాది కొత్త కొత్త బైక్ లు మార్కెట్ లోకి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే వచ్చే ఏడాది కొత్త మోడల్ ఇవి స్కూటర్లను లాంచ్ చేయనున్నారు. మరి త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ఈవీ స్కూటర్లు ఏవి అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఏథర్‌.. బెంగళూరుకు చెందిన ఈవీ తయారీ దారు ఏథర్‌ అందుబాటులో ఏథర్‌ 450 లో కొత్త మోడల్‌ ను ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా ప్రస్తుత 450 శ్రేణి కంటే ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది. ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా చేసిన ట్వీట్ ప్రకారం ఈ స్కూటర్ 2024 ప్రథమార్థంలో విడుదల అవుతుంది. ముఖ్యంగా టీవీఎస్‌ ఐక్యూబ్‌ కు పోటీగా ఈ సరికొత్త స్కూటర్‌ లాంచ్‌ చేస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సింపుల్ డాట్ వన్.. ఈ సింపుల్ ఎనర్జీ అనేది తమిళనాడులో ఉన్న మరొక స్టార్టప్ కంపెనీ. ఈ కంపెనీ రిలీజ్‌ చేసే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ భారీగా ప్రజాదరణ పొందాయి. ఇది ఐడీసీ పరిధి 212 కి.మీ అని కంపెనీ పేర్కొంది. కంపెనీ మొదటి స్కూటర్‌ లో దాదాపు 50 యూనిట్లను డెలివరీ చేసింది. ఇప్పుడు దాని రెండో ఉత్పత్తి సింపుల్ డాట్ వన్‌ ను మరింత సరసమైన ఆఫర్‌ గా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. సింపాలే డాట్ వన్ లాంచ్ డిసెంబర్ 15న జరగనుంది.

హోండా యాక్టివా ఈవీ.. టీవీఎస్‌, హీరో వంటి ప్రధాన స్రవంతి తయారీదారులు ఇప్పటికే ఈవీ స్పేస్‌లో ఉన్నందున హోండా ఆలస్యమైనప్పటికీ యాక్టివా చేసిన మ్యాజిక్‌ ను పూర్తి ఎలక్ట్రిక్ యాక్టివా లాంచ్‌తో మళ్లీ సృష్టించాలని భావిస్తోంది. 2024 ప్రారంభంలో ప్రారంభిస్తారని అంచనా వేస్తున్నారు. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ పోటీ ధరలో ఉంటుంది. అయితే ఆ సమయంలో స్కూటర్ గురించి మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.

సుజుకి బర్గ్‌మాన్ ఎలక్ట్రిక్.. హోండా ఒక ఈవీ రావడంతో సుజుకి కూడా బర్గ్‌మ్యాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను విడుదల చేయనుంది. ఈ స్కూటర్ ఇప్పటికే భారతదేశంలో పరీక్షిస్తున్నట్లు గుర్తించబడింది. 2024 మొదటి అర్ధ భాగంలో లాంచ్ జరుగుతుందని భావిస్తున్నారు. లాంచ్ చేసినప్పుడు సుజుకి బర్గ్‌మ్యాన్ ఎలక్ట్రిక్ ధర రూ. 1 లక్ష షోరూమ్ ధరను కలిగి ఉంటుందని అంచనా.