Safest Cars : రూ.6 లక్షల లోపే 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్లు ఇవే..ఓ లుక్కేయండి..!!!

  • Written By:
  • Publish Date - November 20, 2022 / 12:44 PM IST

కారు భద్రతా పరంగా బాగుంటేనే…మనం డ్రైవింగ్ మెరుగ్గా చేయగలుగుతాం. అందుకే కారు కొనుగోలు చేసేముందు భద్రతా ఫీచర్లను తప్పనిసరిగా చూస్తుంటారు. కారు లుక్, డిజైన్ తోపాటుగా సేఫ్టీ ఫీచర్లను కూడా కస్టమర్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. సేఫ్టీ ఫీచర్లు ఎంత మెరుగ్గా ఉంటే…కారు డ్రైవింగ్ చేసేటప్పుడు అంత సురక్షితంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా వాహనాలు లెటెస్ట్ ఫీచర్లతో వస్తున్నాయి. గ్లోబల్ NCAP భారత్ లో అత్యంత సురక్షితమైన కార్లతోపాటు వాటి 5స్టార్ రేటింగ్ పొందిన కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

NCAP అంటే ?
NCAP అంటే యూకే రిజిస్టర్డ్ చారిటీప్రోగ్రామ్ అని అర్థం. ఇది క్రాష్ టెస్టింగ్ ద్వారా వెహికల్స్ భద్రత రేటింగును అందిస్తుంది. భారత్ లో వాహనాల సేఫ్టి రేటింగ్ గంటలకు 64కిలోమీటర్ల వేగంతో చెక్ చేస్తారు. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ , చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ అని రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. ప్రతి వాహనం కూడా భద్రతా పనితీరుపై ఆధారపడి ఉంటుంది.

మహీంద్రా XUV700
ఇది మహీద్రా గ్రూప్ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన సెకండ్ కారు. ఈకారుకు సేఫర్ ఛాయిస్ అవారడు కూడా ఇచ్చారు. ఈ వెహికల్ పిల్లలరక్షణలో 4 స్టార్ రేటింగ్ ను పొందింది. ఇందులో ఏడు ఎయిర్ బ్యాగులుంటాయి. ఎమర్జన్సీ బ్రేక్, క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, స్మార్ట్ పైలట్ అసిస్ట్, ఆటో హైబీమ్ అసిస్ట్, బూస్టర్ హెడ్ లైట్స్ ఉన్నాయి. దీని ప్రారంభం ధర 13 నుంచి 18 లక్షలు .

టాటా నెక్సాన్
ఈ కారుకు 5స్టార్ రేటింగ్ ను పొందింది. క్రార్ క్రాష్ టెస్టులో 17కి 16.6 స్కోర్ చేసింది. దీని ప్రారంభ ధర. రూ. 7.54లక్షలు. మైలేజ్ లీటర్ కు 21.5కిమీ.

టాటా ఆల్ట్రోజ్
దీని ధర 6.20లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. 1399సీసీ ఇంజన్ కలిగి ఉంది. 5లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. మైలేజ్ లీటరుకు 25.11కిమి. 5స్టార్ రేటింగ్ పొందింది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ లు ఉన్నాయి.

టాటా పంచ్
ఇది 5స్టార్ రేటింగ్ ఇచ్చిన వాహనాలన్నింటిలో కెళ్లా చౌకైనది. దీని ధర 5.82లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. దీనికి గ్లోబర్ NCAP 5స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రిటెన్షర్లు డ్యూయల్ ప్రంట్ ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ రిమైండర్ , ప్రంట్ ఫాగ్ ల్యాంప్స్ , ఆటోమెటిక్ హెడ్ ల్యాంప్స్ , టాప్ ట్రిమ్స్ ఉన్నాయి.