Best Riding Bikes : బెస్ట్ రైడింగ్ బైక్స్ ఇవే..అద్భుతమైన మైలేజ్…ఫీచర్స్ చూస్తే షాకే..!!

లాంగ్ డ్రైవింగ్ ఇష్టపడేవారికి...క్రూయిజర్ బైక్స్ బెస్ట్ ఆప్షన్. తక్కువ సీటింగ్ పొజిషన్, పొడువాటి హ్యాండిల్స్, నేక్డ్ బైక్ లాంటి లుక్...ఇవన్నీ కూడా రైడర్ కు విలాసవంతమైన రైడింగ్ అనుభూతినిస్తాయి.

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 10:46 AM IST

లాంగ్ డ్రైవింగ్ ఇష్టపడేవారికి…క్రూయిజర్ బైక్స్ బెస్ట్ ఆప్షన్. తక్కువ సీటింగ్ పొజిషన్, పొడువాటి హ్యాండిల్స్, నేక్డ్ బైక్ లాంటి లుక్…ఇవన్నీ కూడా రైడర్ కు విలాసవంతమైన రైడింగ్ అనుభూతినిస్తాయి. లాంక్ డ్రైవింగ్ ఇష్టపడేవారి కోసం బెస్ట్ క్రూయిజర్ బైక్స్ లిస్టు ఇక్కడ ఉంది. చూద్దాం.

బజాజ్ అవెంజర్ క్రూయిజ్ 220:
ఈ బైకు 220సీసీ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 19.03PS పవర్, 17.55Nm టార్క్ ప్రొడక్ట్ చేస్తుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.38 లక్షలు.

కొమాకి రేంజర్:
బ్లూటూత్ సౌండ్ సిస్టమ్, సైడ్ స్టాండ్ సెన్సార్, యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తున్న కొమాకి రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్…4,000 వాట్ల బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 200కిమీల రేంజ్‌ ప్రయాణిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్.ధర రూ. 1.68 లక్షలు

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350:
క్రూయిజర్ బైక్‌ల లిస్టులో, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఉంది. ఈ బైక్ భారత్ లో యువత చాలా ఇష్టపడుతుంటారు. ఈ బైక్‌లో 19.36బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 346సిసి ఇంజన్ ఉంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 1.47 లక్షలు.

జావా 42:
జావా 42 క్రూయిజర్ బైక్‌కు భారత్ లో చాలా డిమాండ్ ఉంది. ఈ బైక్‌లో 293cc ఇంజన్ ఉంది. ఇది 27.33PS పవర్, 27.02Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.67 లక్షలు. ఇది టాప్ మోడల్‌కు రూ. 1.94 లక్షల ధరతో మార్కెట్లో లభ్యం అవుతుంది.