Electric Scooters: మహిళలు స్కూటర్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే!

మామూలుగా పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు ఎక్కువ శాతం మంది స్కూటర్లనే ఇష్టపడుతూ ఉంటారు. స్కూటర్లు కూడా కంఫర్టబుల్గా ఉంటాయని వాటిని కొనుగో

  • Written By:
  • Updated On - March 11, 2024 / 07:14 PM IST

మామూలుగా పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు ఎక్కువ శాతం మంది స్కూటర్లనే ఇష్టపడుతూ ఉంటారు. స్కూటర్లు కూడా కంఫర్టబుల్గా ఉంటాయని వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది మహిళలకు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయాలని ఉన్నప్పటికీ ఎలాంటి వాహనాలు కొనుగోలు చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా, అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని రకాల స్కూటర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒడిస్సే రేసర్ లైట్ వీ2.. ఈ స్కూటర్ లో శక్తివంతమైన నీటి నిరోధకత కలిగిన మోటార్ ఉంటుంది.

అలాగే లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది కేవలం మూడు నుంచి నాలుగు గంటలలో పూర్తిగా చార్జ్ అవుతుంది. ఇది 75 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఎల్ఈడీ లైట్లు, విస్తారమైన బూట్ స్పేస్, సుదీర్ఘ ప్రయాణాలకు డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్ వేరియంట్‌తో ఇది వస్తుంది. ప్రకాశవంతమైన ఎరుపు, పాస్టెల్ పీచ్, నీలమణి నీలం, పుదీనా ఆకుపచ్చ, పెర్ల్ వైట్ లేదా కార్బన్ బ్లాక్‌ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీనిపై ప్రస్తుతం పలు ఆఫర్లు ఉన్నాయి. ఆఫర్లలో దీనిని రూ.76,250 కి కొనుగోలు చేయవచ్చు.

అలాగే ఒకినావా రిడ్జ్ 100 స్కూటర్లో శక్తివంతమైన 800వాట్ల మోటార్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ దీనిలో ఉంటుంది. దీనిలోని బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 49 కి.మీ పరిధిని ఇస్తుంది. రిడ్జ్ 100 సెంట్రల్ లాకింగ్, యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, జియో-ఫెన్సింగ్ వంటి అధునాతన ఫీచర్‌లతో నిండి ఉంటుంది. దీని ధర రూ.1,15,311 గా ఉంది.

అదేవిధంగా ఓలా ఎస్1.. ఈ స్కూటర్లో అడ్వాన్స్ డ్ ఫీచర్లు ఉన్నాయి. రిమోట్ లాక్/అన్‌లాక్, జీపీఎస్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్‌ల వంటి అధునాతన ఫీచర్‌లతో కూడిన కాంపాక్ట్ డిజైన్‌ను అందిస్తుంది. 8.5 కేడబ్ల్యూ మోటారుతో నడిచే మోడల్‌లతో, ఆకట్టుకునే వేగం, రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ.1,29,999 గా ఉంటుంది.

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్.. ఈ స్కూటర్లో 550 వాట్ల బీఎల్డీసీ మోటార్, 52.2V, 30Ah లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. దీనిలోని మోటార్ గరిష్టంగా 1.2బీహెచ్పీ శక్తిని అందిస్తుంది. ఈ స్కూటర్ సింగిల్, డబుల్ బ్యాటరీ వేరియంట్‌ లలో లభిస్తుంది. రెండు బ్యాటరీ ల సాయంతో సింగిల్ చార్జ్ పై ఏకంగా 140 కిలో మీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ.1,06,590 గా ఉంది.

ఆంపియర్ మాగ్నస్.. ఈ స్కూటర్ ఈఎక్స్ ఇంటిగ్రేటెడ్ యూఎస్బీ పోర్ట్, ఎల్సీడీ స్క్రీన్, కీలెస్ ఎంట్రీ, యాంటీ-థెఫ్ట్ అలారం వంటి ఫీచర్‌లతో లోడ్ చేసి ఉంటుంది. 1.2 కేడబ్ల్యూ మోటార్ ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 55 వేగంతో ప్రయాణించగలుగుతుంది. 60V, 30Ah బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 121 కిమీల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ.93,900 గా ఉంటుంది.