Site icon HashtagU Telugu

Driving License: ఈ 6 తప్పులు చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దే!

Driving License

Driving License

Driving License: భారతదేశంలో డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) కలిగి ఉండటం అవసరం. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ ట్రాఫిక్ నియమాలను పాటించడం కూడా ముఖ్యం. లేకపోతే మీరు పట్టుబడితే మీకు జరిమానా కూడా విధించవచ్చు. ఇది మాత్రమే కాదు కొన్ని సందర్భాల్లో లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరం. జరిమానా, జైలు శిక్ష కూడా విధిస్తారు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఏయే సందర్భాలలో రద్దు చేస్తారో ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం.

రెడ్ లైట్ క్రాస్ చేస్తే

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రెడ్ లైట్‌ను క్రాస్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయ‌వ‌చ్చు. రెడ్ లైట్ క్రాస్ తీవ్రమైన నేరం. రెడ్ లైట్ జంప్ చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్‌ తాత్కాలికంగా నిలిపివేస్తారు. లేదా రద్దు చేస్తారు. రెడ్ లైట్లు క్రాస్ చేయ‌డం వల్ల చాలా ఘోరమైన రోడ్డు ప్రమాదాలు తరచుగా జ‌రుగుతుంటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్ లైట్ జంప్ చేయ‌కూడదు.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఉపయోగించడం

మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ని ఉపయోగిస్తూ పట్టుబడితే జరిమానా విధించబడడమే కాకుండా లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. డ్రైవింగ్ చేసేట‌ప్పుడు మొబైల్ ఫోన్‌ని ఉపయోగించడం చాలా హానికరం. ఎందుకంటే ఇది ప్ర‌మాదాల‌ను పెంచుతుంది.

తాగి డ్రైవింగ్

మ‌ద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది. మద్యం సేవించి వాహనం నడపితే జైలు శిక్ష‌తో పాటు భారీగా జ‌రిమానా విధిస్తారు.

Also Read: Personality Test : మీరు తరుచూ ఉపయోగించే ఎమోజీలు మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయట..!

అతివేగంగా డ్రైవింగ్‌

అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ. అతివేగానికి పాల్పడినట్లు తేలితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. అందువల్ల వాహ‌న‌దారులు నెమ్మదిగా డ్రైవ్ చేయ‌టం అల‌వాటు చేసుకోవాలి.

ఫాగ్ ల్యాంప్ దుర్వినియోగం

ఫాగ్ ల్యాంప్‌లను శీతాకాలంలో, వర్షాల సమయంలో పొగమంచును తగ్గించడానికి ఉపయోగిస్తారు. లేకుంటే జరిమానా విధించబడవచ్చు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా ర‌ద్దు చేయ‌వ‌చ్చు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘన‌

నిరంతరం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తారు. రాంగ్ లేన్‌లో డ్రైవింగ్ చేసినందుకు, తప్పుడు పద్ధతిలో ఓవర్‌టేక్ చేసినందుకు కూడా కఠిన చర్యలు తీసుకోవచ్చు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తే నష్టం ఉంటుందా?

డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తే అధిక బీమా ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. ఇది ఖరీదైన డీల్‌గా మారవచ్చు. అందువల్ల, డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించడం చాలా ముఖ్యం.