Tata Punch: టాటా మోటార్స్ తన అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో-SUV, టాటా పంచ్ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. 2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధరను కంపెనీ రూ. 5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. కొత్త డిజైన్, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజన్ అప్‌డేట్స్‌తో వచ్చిన ఈ కారు.. హ్యుందాయ్ ఎక్స్‌టర్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్, మహీంద్రా XUV 3XO వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. దీని కోసం బుకింగ్‌లు ఈ రోజు నుండే ప్రారంభమయ్యాయి.
ఆరు వేరియంట్లలో లభ్యం
కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను కంపెనీ మొత్తం ఆరు వేరియంట్లలో లాంచ్ చేసింది.
- స్మార్ట్ (Smart)
- ప్యూర్ (Pure)
- ప్యూర్+ (Pure+)
- అడ్వెంచర్ (Adventure)
- అకంప్లిష్డ్ (Accomplished)
- అకంప్లిష్డ్+ S (Accomplished+ S)
బయటి డిజైన్‌లో మార్పులు
కొత్త పంచ్ తన పాత బాక్సీ, ధృడమైన రూపాన్ని కొనసాగిస్తూనే ఇప్పుడు మరింత షార్ప్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తోంది. దీని డిజైన్ ఇప్పుడు Punch.evని పోలి ఉంటుంది. కొత్త LED హెడ్‌ల్యాంప్‌లు, స్లిమ్ DRLలు, కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన LED ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. కొత్త గ్రిల్, స్పోర్టీ బంపర్, సరికొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేట్ చేయబడిన LED టెయిల్ ల్యాంప్‌లు దీనికి కొత్త రూపాన్ని ఇచ్చాయి. ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read: బిఆర్ఎస్ రెచ్చగొడుతుందంటూ పొంగులేటి ఫైర్
కొత్త కలర్ ఆప్షన్లు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి టాటా మోటార్స్ కొన్ని కొత్త రంగులను పరిచయం చేసింది. ఇప్పుడు ఈ కారు సైంటాఫిక్, కారామెల్, బెంగాల్ రూజ్, కూర్గ్ క్లౌడ్స్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
ఇంటీరియర్- టెక్నాలజీ
క్యాబిన్ లోపల కూడా భారీ మార్పులు చేశారు. 26.03 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 17.8 సెం.మీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ IRVM, సెంట్రలక్స్ (CentraLuxe) కంట్రోల్‌తో కూడిన ఆర్మ్‌రెస్ట్ ఉన్నాయి.
భద్రతలో రాజీ లేదు
టాటా పంచ్ ఇప్పటికే వయోజనులు, పిల్లల రక్షణలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. కొత్త మోడల్‌లో భద్రతను మరింత పెంచుతూ స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇచ్చింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ ఇచ్చింది.
శక్తివంతమైన కొత్త iTurbo ఇంజన్
ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ప్రధాన ఆకర్షణ 1.2-లీటర్ iTurbo పెట్రోల్ ఇంజన్.
పవర్: 120 PS @ 5500 rpm.
టార్క్: 170 Nm @ 1750-4000 rpm.
వేగం: ఇది కేవలం 11.1 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
ఇతర ఇంజన్ ఆప్షన్లు
1.2L రెవోట్రాన్ పెట్రోల్: 87.8 PS పవర్/ 115 Nm టార్క్ (5-స్పీడ్ MT/AMT).
CNG వెర్షన్: 73.4 PS పవర్/ 103 Nm టార్క్ ఇచ్చే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కూడా అందుబాటులో ఉంది.
