Mahindra Scorpio: జీఎస్టీ తగ్గింపు తర్వాత మహీంద్రా స్కార్పియో ధరలు ఇవే!

భారత మార్కెట్‌లో మహీంద్రా స్కార్పియోకు గట్టి పోటీనిచ్చే కార్ల విషయానికి వస్తే ఈ కారు టాటా సఫారీ, టాటా హారియర్, హ్యుందాయ్ క్రెటా వంటి కార్లతో పోటీపడుతుంది.

Published By: HashtagU Telugu Desk
Mahindra Scorpio

Mahindra Scorpio

Mahindra Scorpio: జీఎస్టీ (GST) తగ్గింపు కారణంగా ప్రజలకు ప్రయోజనం చేకూరడం ప్రారంభమైంది. దీంతో ఇప్పటికే మహీంద్రా చాలా కార్ల ధరలు తగ్గాయి. అంతేకాకుండా కంపెనీ స్కార్పియో (Mahindra Scorpio) క్లాసిక్‌పై భారీగా ధర తగ్గింపును ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపు తర్వాత మహీంద్రా స్కార్పియో ఎంత చౌకగా లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మార్కెట్‌లో ఈ కారుకు ఏవి పోటీగా ఉన్నాయో కూడా చూద్దాం.

ధర తగ్గింపు వివరాలు

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ S11 డీజిల్-MT వేరియంట్‌పై అత్యధిక తగ్గింపు లభించింది. ఈ వేరియంట్‌పై కస్టమర్‌లు రూ. 1.20 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. మిగిలిన వేరియంట్లపై కూడా వినియోగదారులు రూ. 80 వేల నుండి రూ. 1 లక్ష వరకు ఆదా పొందుతున్నారు. దీంతో గతంతో పోలిస్తే మహీంద్రా స్కార్పియో కొనడం ఇప్పుడు మరింత ‘వాల్యూ-ఫర్-మనీ’గా మారింది.

Also Read: Telangana Assembly : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ విడుదల

మహీంద్రా స్కార్పియో ఫీచర్లు

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇందులో పెద్ద 9-అంగుళాల టచ్‌స్క్రీన్, డ్యూయల్-టోన్ బ్లాక్ థీమ్ ఉన్నాయి. స్కార్పియో క్లాసిక్‌లో ఆడియో నియంత్రణలతో కూడిన లెదర్ స్టీరింగ్ వీల్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, పార్ట్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి కూడా జోడించారు.

మహీంద్రా స్కార్పియో ఇంజన్, భద్రత

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 132hp, 300Nm, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇందులో ఆల్ అల్యూమినియం లైట్‌వెయిట్ GEN-2 mHawk ఇంజన్ ఉంది. భద్రతా (Safety) ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్, ABS, స్పీడ్ అలర్ట్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

అదనంగా ఈ ఎస్‌యూవీలో మీకు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో (LED DRLs) కూడిన ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ కారులో 460 లీటర్ల బూట్ స్పేస్ తో పాటు 60 లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ కూడా లభిస్తుంది.

పోటీదారులు

భారత మార్కెట్‌లో మహీంద్రా స్కార్పియోకు గట్టి పోటీనిచ్చే కార్ల విషయానికి వస్తే ఈ కారు టాటా సఫారీ, టాటా హారియర్, హ్యుందాయ్ క్రెటా వంటి కార్లతో పోటీపడుతుంది.

  Last Updated: 27 Sep 2025, 04:01 PM IST