Cars under 4 lakh : ఈ దీపావళికి కారు కొనాలనుకుంటున్నారా..? రూ. 4 లక్షలోపు ది బెస్ట్ కార్లు..ఇవే..!!

మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా పండగ సీజన్లో వచ్చే ఆఫర్ల కోసం చూస్తుంటారు. పండగల సీజన్లో బోలెడన్ని ఆఫర్లు ప్రకటిస్తుంటాయి కంపెనీలు.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 10:27 AM IST

మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా పండగ సీజన్లో వచ్చే ఆఫర్ల కోసం చూస్తుంటారు. పండగల సీజన్లో బోలెడన్ని ఆఫర్లు ప్రకటిస్తుంటాయి కంపెనీలు. కొత్త కారు కొనాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ బడ్జెట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంటారు. అయితే ఈ దసరా లేదంటే దీపావళికి మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకుంటే…4లక్షల లోపు బెస్ట్ కార్లు కావాలనుకునేవారి కోసం లిస్టు ఉంది. ఓ సారి చెక్ చేయండి.

మారుతీ సుజుకి ఆల్టో:
మారుతీ సుజుకి ఆల్టో…చూడటానికి చిన్నగా ఉంటుంది. చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. భారత మార్కెట్లో, ఎక్స్-షోరూమ్‌లో ఈ కారు ప్రారంభ ధర రూ.5.03 లక్షలుగా ఉంది. ఇది 22.05 kmpl మైలేజీని ఇస్తుంది. మారుతి సుజుకి ఆల్టోలో పవర్ కోసం, 796 cc ఇంజన్ ఇచ్చారు, ఇది గరిష్టంగా 48PS శక్తిని, 69Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా పొందుతుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లున్న ఈ కారును కొనుగోలు చేయండి.

మారుతి సుజుకి ఆల్టో K10:
భారత మార్కెట్లో ఈ కారు మొత్తం 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీనితో పాటు ఆరు రంగుల్లో మీకు కావాల్సిన కలర్ సెలక్ట్ చేసుకోవచ్చు. ఇది 25 kmpl మైలేజీని ఇస్తుంది. ఈ న్యూ జనరేషన్ కారు 5500 rpm వద్ద 67 PS శక్తితోపాటు 89 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 998 cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో AGS ఆప్షన్ ఉంటుంది. ఎక్స్-షోరూమ్‌లో దీని ప్రారంభ ధర రూ. 3.99 లక్షలు.

డాట్సన్ రెడీ గో:
ఎక్స్-షోరూమ్‌లో దీని ధర రూ. 3,97,800, ఇది 22 kmpl మైలేజీని ఇస్తుంది.0.8-లీటర్ 1-లీటర్ ఇంజన్లతో అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీని 0.8-లీటర్ ఇంజన్ 54 PS పవర్ , 72 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. ఇందులోని 1 లీటర్ ఇంజన్ 68 PS పవర్ 91 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అమర్చబడింది.

డాట్సన్ గో:
ఎక్స్-షోరూమ్‌లో దీని ధర రూ. 4,02,778. ఇది 19 kmpl మైలేజీని కూడా ఇస్తుంది. ఇందులో 1.2 లీటర్ 3-సిలిండర్ HR12 DE పెట్రోల్ ఇంజన్ ఉంది. దీని మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 68 PS పవర్ 104 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, దీని CVT గేర్‌బాక్స్ 77 PS శక్తిని 104 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.