Site icon HashtagU Telugu

Tesla India: భారత్ లో ప్లాంట్ పై …టెస్లా అధినేత మస్క్ సంచలన వ్యాఖ్యలు…!

Elon Imresizer

Elon Imresizer

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారత్ లో టెస్లా తయారీ ప్లాంట్ పెట్టడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట కార్లను దిగుమతి చేసి అమ్మడం, సర్వీసుకు అనుమతించే వరకు ప్లాంట్ ను పెట్టే ప్రసక్తే లేదంటూ తెల్చేశారు. దక్షిణ భారతదేశంలో టెస్లా ప్లాంట్ పెడుతోందంటూ కేంద్రం ఈమధ్యే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఎలాన్ మస్క్ ఈ విధంగా బదులిచ్చారు.

ముందుగా మా కార్లను అమ్ముకుని..సర్వీసు చేసుకునేంత వరకు భారత్ లో ఏ ప్రాంతంలోనూ కార్ల ఉత్తత్పి ప్లాంట్లను పెట్టడం లేదంటూ మస్క్ ఖచ్చితంగా చెప్పేశారు. నిజానికి ఏడాది కాలంగా కేంద్ర ప్రభుత్వం టెస్లా కార్ల ప్లాంట్ ఏర్పాటు పై వివాదం కొనసాగుతోంది. ముందుగా ఇక్కడ ప్లాంట్ పెట్టి తయారు చేసి కార్లు అమ్మాలంటూ…ఆ తర్వాత దిగుమతి చేసుకుని అమ్మేందుకు అవకాశం ఇస్తామని కేంద్రం చెబుతోంది. దానికి మస్క్ మాత్రం ససేమిరా అంటున్నారు. ముందుగా కార్లను దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని..దిగమతి సుంకాలను తగ్గించాలని…దేశంలో మార్కెట్ ను బట్టి ప్లాంట్ ఏర్పాటుపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. దీంతో ఆ వ్యవహారం ఎటూ తేలకుండానే ఇప్పుడు మస్క్ సమాధానం మరింత క్లిష్టంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.