Site icon HashtagU Telugu

Tesla Y: అమెరికాలో Y మోడల్ ధరలను పెంచిన టెస్లా

Tesla Y

New Web Story Copy (64)

Tesla Y: ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లా భారత్‌లో తన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతోంది. నిజానికి గతంలో భారత ప్రభుత్వంతో టెస్లా చర్చలు జరిపింది. అయితే చర్చలు విఫలమవడంతో టెస్లా ఇండియాలోకి అడుగుపెట్టలేకపోయింది. అయితే ఇండియాలో తమ కార్లను అమ్ముతామని సంస్థ సీఈఓ ఎలెన్ మాస్క్ చెప్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా టెస్లా తమ ధరలను పెంచుతున్నట్టు తెలిపింది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అమెరికాలో టెస్లా వై మోడల్ ధరలను పెంచినట్టు తెలిపింది. అమెరికాలో వై ధరలను పెంచినట్టు తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. టెస్లా ఇంక్ యునైటెడ్ స్టేట్స్‌లో దాని మోడల్ Y ఎలక్ట్రిక్ వాహనం ధరను పెంచినట్లు తెలిపింది. కంపెనీ ఈ వేరియంట్ ధరను కేవలం $250 పెంచింది. దాంతో టెస్లా వై మోడల్ ధర ఇప్పుడు $47,740కి పెరిగింది. కాగా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇతర వేరియంట్‌ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. యుఎస్‌లో టెస్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్ బ్రాండ్‌లలో ఒకటి అని తెలిసిందే. టెస్లా యునైటెడ్ స్టేట్స్‌లో మోడల్ Y ధరలను మూడవసారి పెంచింది.

Read More: Megastar Chiranjeevi: రక్తదాతలే నిజమైన దేవుళ్లు: మెగాస్టార్ చిరంజీవి ట్వీట్!