Site icon HashtagU Telugu

Electric Car: అరగంటలోనే ఫుల్ ఛార్జ్.. ఒక్క ఛార్జ్ తో 570 కిలోమీటర్ల ప్రయాణం?

Mixcollage 27 Feb 2024 02 51 Pm 9962

Mixcollage 27 Feb 2024 02 51 Pm 9962

ప్రస్తుతం మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో టెస్లా, బీవైడీ సంస్థల మధ్య గట్టి పోటీ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే టెస్లా కంపెనీ భారత్‌లోకి రంగ ప్రవేశం చేసి, బీవైడీ సంస్థ టెస్లా కార్లను తలదన్నే విధంగా సరికొత్త మోడల్‌లో ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. అయితే ఇందులో భాగంగానే ఆ సంస్థ నుంచి మార్చి 5న సీల్ ఎలక్ట్రిక్ సుడాన్ పేరుతో మరో ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కార్ టెస్లా మోడల్ 3కి పోటీ ఇవ్వనుంది. ఇండియన్ రోడ్లపై టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంటే.. ఈ సీల్ ఎలక్ట్రిక్ సుడాన్ పరుగులు పెట్టేందుకు సిద్దమైంది.

అయితే ఇప్పటికే BYD సంస్థ రెండు ఎలక్ట్రిక్ కార్లు అటో 3 SUV, e6 MPV లను మార్కెట్‌లోకి తీసుకొచ్చచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ మూడో ఎలక్ట్రిక్ కారు స్పెసిఫికేషన్లు, ధర,ఫీచర్ల విషయానికి వస్తే.. BYD సీల్… బ్యాటరీ, రేంజ్ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారులో 82.5 kWh బ్యాటరీ ప్యాక్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి పూర్తిగా ఫుల్ ఛార్జ్ చేస్తే, ఈ కారు 570 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఇది శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌పై నడుస్తుంది. ఈ కారు కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100 km/h వేగాన్ని అందుకోగలదు. ఛార్జింగ్, పనితీరు BYD నుంచి రాబోయే ఎలక్ట్రిక్ సుడాన్ బరువు 2,055 కిలోలు. ఈ కారు బ్యాటరీలో కంపెనీకి చెందిన బ్లేడ్ టెక్నాలజీని ఉపయోగించారు.

150kW వరకు ఛార్జింగ్ వేగంతో ఈ కారు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. కేవలం 26 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. సాధారణ 11kW AC ఛార్జర్‌తో సీల్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 8.6 గంటలు పడుతుంది. ఫీచర్లు ఈ కారు డ్యూయల్ మోటార్‌తో AWD వేరియంట్‌లో కూడా అందుబాటులోకి రావచ్చు. ఈ మోడల్ ఫుల్ ఛార్జింగ్‌పై 520 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గ్లాస్ రూఫ్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్లు, నాలుగు బూమరాంగ్ షేప్ LED DRLలు, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, ఫుల్ వైడ్ LED లైట్ బార్‌ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. BYD సీల్ ఎలక్ట్రిక్ సుడాన్ 15.6 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ని కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు దాదాపు రూ. 50లక్షల ధరతో లభించనుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.