Tesla India : టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కోసం భారత వాహన ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో అకస్మాత్తుగా భారత్‌లో టెస్లా కారు ప్రత్యక్షమైంది. ముంబై – పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై టెస్లా కారు వెళ్తున్న వీడియో ఒకటి లీకైంది. బహుశా ఆ టెస్లా కారును టెస్టింగ్ చేస్తుండొచ్చని తెలుస్తోంది. ఈ కారు వీడియోను సోషల్ మీడియా వేదికగా చూసిన నెటిజన్లు తీరొక్క కామెంట్లు పెడుతున్నారు. టెస్లా భారత్‌లోకి వచ్చేస్తోందని హర్షం వెలిబుచ్చుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు టెస్లా ‘మోడల్ వై’ ఫేస్‌లిఫ్ట్ వర్షన్. దీన్ని ‘జూనిపర్’ అనే కోడ్ నేమ్‌తో పిలుస్తున్నారు.
Also Read :Tamil Nadu Autonomous : తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. స్టాలిన్ డిమాండ్ అందుకేనా ?
టెస్లా ‘మోడల్ వై’ కారు ఫీచర్లు
- టెస్లా(Tesla India) ‘మోడల్ వై’ కారులో సీ-ఆకారపు టెయిల్ లైట్లు, మల్టీ-స్పోక్ అలాయ్ వీల్స్, విశాలమైన గ్లాస్ రూఫ్ ఉంటాయి.
- ఇది ఆల్‌వీల్ డ్రైవ్ మోడ్‌లో లభిస్తోంది.
- లాంగ్ మైలేజీ ఇచ్చే బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 526 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.
- ఈ కారు 4.6 సెకన్లలోనే గంటకు 0 నుంచి 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో టెస్లా మోడల్ వై కారు ప్రయాణిస్తుంది.
- దీనిలో భారీ 15.4 టచ్‌స్క్రీన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది.
- ఈ కారు వెనుక సీట్లలో ప్యాసింజర్ల కోసం 8 అంగుళాల ప్రత్యేకమైన స్క్రీన్ ఉంటుంది.
- అడాస్ ఫీచర్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి హంగులు కూడా ఉంటాయి.
- భారత్‌లో విడుదలయ్యే నాటికి టెస్లా ఎలక్ట్రిక్ కార్లలో స్వల్ప మార్పులు జరగొచ్చని తెలుస్తోంది. భారతీయ వినియోగదారుల అభిరుచుల ప్రకారం ఫీచర్లలో మార్పులు చేయనున్నారు.