Site icon HashtagU Telugu

Tesla Data Leak: టెస్లా సెల్ఫ్ డ్రైవ్ డేటా లీక్..

Tesla Data Leak

New Web Story Copy 2023 05 27t170235.394

Tesla Data Leak: వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ ఎలోన్ మస్క్. టెక్నాలజీని వాడకంలో మస్క్ తరువాతనే ఎవరైనా. తాజాగా ఆయన ట్విట్టర్ ని కొనుగోలు చేసి రోజుకొక ఆప్షన్ మారుస్తూ వింత చేష్టలకు పాల్పడుతున్నాడు. ఇక ఆయన టెస్లా కంపెనీ మొదటి నుండి వివాదాల్లోనే ఉంటుంది. తాజాగా టెస్లా కంపెనీకి చెందిన 100GB డేటా జర్మన్ మీడియాకు లీక్ అయింది.

ఈ ఏడాది చివరి నాటికి సెల్ఫ్ డ్రైవింగ్ కారును విడుదల చేయనున్నట్లు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇటీవల ప్రకటించిన తరుణంలో ఈ డేటా లీక్ అయింది. అమెరికా, యూరప్ మరియు ఆసియాలోని కస్టమర్‌ల నుండి 2015 నుండి మార్చి 2022 వరకు టెస్లాసెల్ఫ్ డ్రైవింగ్ కార్ల సమస్యల గురించి ఫిర్యాదుల డేటా లీక్ అయినట్లు టెస్లా అనుమానిస్తోంది. ఇందులో 2400 ఫిర్యాదులు యాక్సిలరేషన్‌కు సంబంధించినవి, 1500 ఫిర్యాదులు బ్రేకింగ్‌కు సంబంధించినవి మరియు 139 ఫిర్యాదులు ఎమర్జెన్సీ బ్రేక్‌కు సంబంధించినవి.

డేటా గురించి టెస్లా ఏమి చెప్పింది?
లీకైన డేటాకు సంబంధించిన సమాచారాన్ని టెస్లాకు అందించిన వెంటనే. డేటా చోరీకి గురైందని, దానిని తొలగించాలని కంపెనీని డిమాండ్ చేసింది.

టెస్లా FSD అంటే ఏమిటి?
అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా చాలా ఆధునిక కార్లను తయారు చేస్తుంది. పూర్తి స్వీయ-డ్రైవింగ్ ఫీచర్ (FSD) కంపెనీ కార్లలో అందించబడింది, దీని సహాయంతో వాహనం మనిషి అవసరం లేకుండా స్వయంగా డ్రైవ్ చేయగలదు.

Read More: Tesla Data Leak: టెస్లా సెల్ఫ్ డ్రైవ్ డేటా లీక్..