Site icon HashtagU Telugu

Tesla In Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మ‌రో భారీ శుభ‌వార్త‌.. రాయ‌ల‌సీమ‌కు టెస్లా కంపెనీ!

Tesla In Andhra Pradesh

Tesla In Andhra Pradesh

Tesla In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం EV ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి టెస్లాకు భూమి, పోర్ట్ కనెక్టివిటీ (ఓడరేవు యాక్సెస్‌)ను అందిస్తోంది. ఇందుకోసం మంత్రి నారా లోకేష్ 2024లో టెస్లా సీఎఫ్‌వోను కలిశారు. టెస్లా ఇప్పుడు భారతదేశానికి రావడానికి సిద్ధంగా ఉంది. ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి దేశంలోని అనేక రాష్ట్రాలు కంపెనీని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి.

అయితే ఆంధ్రప్రదేశ్ త‌మ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌ను (Tesla In Andhra Pradesh) ఏర్పాటు చేయడానికి ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లాకి ఆఫర్ ఇచ్చింది. టెస్లాను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోర్ట్ కనెక్టివిటీ, తగినంత భూమిని అందించింది. ఇందుకోసం మంత్రి నారా లోకేష్ 2024లో టెస్లా సీఎఫ్‌వోను కలిశారు. మీడియా కథనాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి బోర్డు (EDB) కంపెనీకి పోర్ట్ కనెక్టివిటీ, తగినంత భూమిని ఆఫర్ చేసిందని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ (టీడీనీ) కొత్త ప్రభుత్వం 2024 అక్టోబర్‌లో టెస్లాతో చర్చలు జరిపిందని, మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజాను కూడా కలిశారని మన‌కు తెలిసిందే.

Also Read: Sourav Ganguly: మ‌రో ఫ్యాక్ట‌రీని స్టార్ట్ చేసిన సౌర‌వ్ గంగూలీ.. ఈసారి ఎక్క‌డంటే?

ప్రధాని మోదీ, ఎలాన్ మస్క్‌ల సమావేశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్‌ల సమావేశం తరువాత భారతదేశంలో టెస్లా ప్రవేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ మళ్లీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. టెస్లా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్యాకేజీని సిద్ధం చేసిందని, ఇందులో ఇప్పటికే అందుబాటులో ఉన్న భూమిని కూడా చేర్చినట్లు వార్తలు వ‌స్తున్నాయి. ప్రారంభంలో కంపెనీ పూర్తయిన కార్లను దిగుమతి చేసుకోవచ్చు. క్రమంగా దాని స్వంత తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలుస్తోంది.

2017లో ఎంఓయూపై సంతకాలు చేశారు

2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెస్లాతో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశారు. దీని ప్రకారం రాయలసీమలో రెండు 4 మెగావాట్ల సామర్థ్యం గల సౌరశక్తి నిల్వ యూనిట్ల ఏర్పాటుకు సాంకేతిక సహకారం అందిస్తామని మస్క్ హామీ ఇచ్చారు.