Site icon HashtagU Telugu

Tesla Car: టెస్లా కారులో మరో సీక్రెట్ ఫీచర్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?

Tesla In India

Tesla In India

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది ఈ నాయకులు, సెలబ్రిటీలు, ఇష్టపడే కార్లలో టెస్లా కారు కూడా ఒకటి. వీటికి మార్కెట్లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే టెస్లా సంస్థ మార్కెట్లో ఉన్న అనేక రకాల కార్ల కంపెనీలకు పోటీగా నిలుస్తూ దూసుకుపోతోంది. ఇలా ఉండి తాజాగా ఈ టెస్లా కార్లలో ఒక రహస్య ఫీచర్‌ బయటపడింది. టెస్లా సాఫ్ట్‌వేర్ హ్యాకర్‌ కనుక్కున్న ఈ ఫీచర్‌కు ఎలోన్ మోడ్ అని పేరు పెట్టినట్లు ది వెర్జ్ వార్తా సంస్థ నివేదిక వెల్లడించింది.

ఈ ఫీచర్ టెస్లా వాహనాల్లో హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్‌ను అనుమతిస్తుంది. @greentheonly అనే పేరుతో ట్విటర్‌లో ఈ రహస్య ఫీచర్‌ గురించి హాకర్‌ పేర్కొన్నారు. ఎలాన్ మోడ్‌ ను కనుగొని, ఎనేబుల్‌ చేసి పరీక్షించిన హాకర్‌ దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అంతా బాగానే ఉంది కానీ ఈ ఫీచర్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం కార్‌ లోపల స్క్రీన్‌పై లేదు. టెస్లా పూర్తి స్వీయ డ్రైవింగ్ అనేది బీటా స్థితిలో పరీక్ష స్థాయిలో ఉన్న అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థ. ప్రస్తుతానికి 15 వేల డాలర్లు అదనంగా చెల్లించిన వారికి ఇది అందుబాటులో ఉంది.

 

కానీ ఎఫ్‌ఎస్‌డీ సాఫ్ట్‌వేర్‌పై కస్టమర్ల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చినట్లు గత నెలలో బయటకు పొక్కిన ఒక అంతర్గత నివేదిక ద్వారా తెలిసింది. ఉన్నట్టుండి ఆగిపోవడం, స్పీడ్‌ పెరిగిపోవడం వంటి లోపాలు ఉన్నట్లు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. కాగా టెస్లా ఆటో పైలట్ సిస్టమ్ అనేది హైవేల కోసం కంపెనీ రూపొందించిన మొదటి తరం డ్రైవర్ సహాయక వ్యవస్థ. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ అయినప్పటికీ డ్రైవింగ్‌ సమయంలో అందులోని వ్యక్తి అప్రమత్తంగా ఉన్నారని నిర్ధారించడానికి స్టీరింగ్ వీల్‌ను అప్పుడప్పుడు తాకాల్సి ఉంటుంది. ఇలా తరచూ చేయాల్సి ఉండటంపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న హ్యాండ్స్ ఆన్ స్టీరింగ్ కన్ఫర్మేషన్‌తో పాటు సెంటర్ ఇంటీరియర్ కెమెరా డ్రైవర్లు ముందుకు చూస్తున్నారా లేదా అని గమనిస్తాయి. హాకర్‌ ఎలాన్‌ మోడ్‌ లో నిర్వహించిన 600 మైళ్ల పరీక్షలో అలాంటి ఇబ్బందులేవీ ఎదురవ్వలేదని నివేదిక తెలిపింది. ఈ మోడ్‌లో సిస్టమ్ లేన్‌లను మార్చడం, హైవేపై నెమ్మదిగా డ్రైవింగ్ ముగించడం గుర్తించినట్లు హాకర్‌ ట్విటర్‌లో వివరించారు. 2017తో పోల్చితే టెస్లా సాఫ్ట్‌వేర్ మరింత సురక్షితమైనదని తెలిపాడు.