Tesla In India: భారత్ లోకి టెస్లా..

ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ భేటీలో భాగంగా అనేక పారిశ్రామికవేత్తలతో మోడీ భేటీ కానున్నారు.

Published By: HashtagU Telugu Desk
Tesla In India

New Web Story Copy 2023 06 21t142654.516

Tesla In India: ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ భేటీలో భాగంగా అనేక పారిశ్రామికవేత్తలతో మోడీ భేటీ కానున్నారు. ఇక అమెరికా పెట్టుబడి దారులు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ మోడీతో భేటీ అయ్యారు.

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ న్యూయార్క్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పిఎం మోడీని కలిసిన తర్వాత ఎలాన్ మస్క్ మాట్లాడుతూ… మానవీయంగా సాధ్యమైనంత వరకు టెస్లా ఖచ్చితంగా భారతదేశానికి వస్తుందని అన్నారు. తాను ప్రధాని మోదీకి వీరాభిమానిని అని ఎలోన్ మస్క్ అన్నారు. మోడీ భారతదేశం గురించి చాలా శ్రద్ధ వహిస్తారని మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో భారతదేశంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా, పెట్టుబడి దారులను మోడీ ప్రోత్సహిస్తున్నట్టు మస్క్ ఈ సందర్భంగా తెలిపారు. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ త్వరలో భారత్‌లో కూడా అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా టెస్లా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ. ప్రస్తుతం ఈ కంపెనీ కార్లకు మార్కెట్లో అదిరిపోయే డిమాండ్ ఉంది. పూర్తి టెక్నాలజీ సహాయంతో రూపొందించిన టెస్లా కార్ల ఫ్యూచర్స్ చూస్తే మతిపోతుంది. అత్యాధునిక టెక్నాలజీ, లోపల లగ్జరీ సీటింగ్, డిజిటల్ స్క్రీనింగ్, ఇలా టెస్లా కార్ లోపల ఒక ప్రపంచాన్నే సృష్టించాడు మస్క్.

Read More: Crime: మాట్లాడాలని పిలిచి.. ప్రియురాలిపై దాడి

  Last Updated: 21 Jun 2023, 02:27 PM IST