Tesla EV Car: మార్కెట్లోకి రాబోతున్న టెస్లా సరికొత్త ఎలక్ట్రిక్ కారు.. ధర, ఫీచర్స్ మామూలుగా లేవుగా?

ప్రముఖ వాహన తయారీ సంస్థ టెస్లా తన చౌకైన ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతున్

  • Written By:
  • Publish Date - January 26, 2024 / 07:30 PM IST

ప్రముఖ వాహన తయారీ సంస్థ టెస్లా తన చౌకైన ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతున్న ఆ సరికొత్త ఎలక్ట్రిక్ కారుకు రెడ్‌వుడ్ అని పేరును కూడా పెట్టారు. ఈ కారును వచ్చే ఏడాది అంటే 2025లో లాంచ్ చేయవచ్చు. దీని ఉత్పత్తి జూన్ 2025లో ప్రారంభమవుతుందని అంచనా. అయితే దాని డెలివరీ కొన్ని నెలల తర్వాత ఉంటుదని తెలుస్తోంది. వాస్తవానికి, ఎలోన్ మస్క్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్లు, సెల్ఫ్ డ్రైవింగ్ రోబో ట్యాక్సీలను తీసుకురావాలని అనుకుంటున్నారు. అయితే నివేదికల ప్రకారం టెస్లా ప్రతి వారం 10,000 యూనిట్ల రెడ్‌వుడ్ ఎలక్ట్రిక్ కారును ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది.

ఈ ఎలక్ట్రిక్ కార్లను NV9X ఆర్కిటెక్చర్‌లో నిర్మించవచ్చు. దీనిపై కంపెనీ కనీసం రెండు కొత్త కార్లను విడుదల చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ కార్లు టెస్లా బర్లింగేమ్ కంపెనీలో తయారు చేయబడతాయి. మరి ఈ కారు ధర విషయానికి వస్తే.. ఇది టెస్లా ప్రవేశ స్థాయి ఎలక్ట్రిక్‌ కారు. దీని ధర 25 వేల డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 21 లక్షల రూపాయలుగా ఉండవచ్చని అంచనా. అంటే ఈ కారు ఫార్చ్యూనర్ కంటే చౌకగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ కారు పెట్రోల్, డీజిల్ కార్లకు కూడా గట్టి పోటీని ఇవ్వగలదు. టెస్లా సరసమైన ఎలక్ట్రిక్ కార్లు చైనీస్ కంపెనీ BYD ఎలక్ట్రిక్ కార్లతో పోటీపడతాయి. భారత్‌లో టెస్లా ప్రవేశానికి సంబంధించిన అంశం ఇంకా చిక్కుల్లోనే ఉంది.

టెస్లా కంపెనీ కార్లపై భారత ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరుతోంది. టెస్లా తన కార్లను భారత్‌లో దిగుమతి చేసుకుని విక్రయించనుంది. దీంతో భారత్‌లో టెస్లా కార్లు ఖరీదైనవిగా మారనున్నాయి. టెస్లా కార్లను భారతదేశంలోనే తయారు చేయాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం మొత్తం మ్యాటర్ ఇక్కడే ఇరుక్కుంది. టెస్లా మోడల్ 3 కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 535 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది కార్ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది. కేవలం 15 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే 236 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.