Tesla Cars – India : ‘టెస్లా’ ఎలక్ట్రిక్ కార్లు .. ప్రపంచంలోనే అడ్వాన్స్‌డ్.. అత్యంత చౌక కూడా !! ఇవి మన ఇండియాలోకి ఎప్పుడు రాబోతున్నాయి ? కార్ లవర్స్ వీటి రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారికి ఒక గుడ్ న్యూస్. టెస్లా కార్లు ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చే టైం బాగా దగ్గర పడింది. వచ్చే ఏడాది జనవరి నుంచే మన దేశంలో టెస్లా కార్ల సేల్స్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయట. భారత్‌లో కార్లు, కార్ల బ్యాటరీల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని టెస్లా భావిస్తోంది. ఈమేరకు టెస్లా కంపెనీ సమర్పించిన దరఖాస్తులను ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన భారత ప్రభుత్వ విభాగాలు ప్రాసెసింగ్ చేస్తున్నాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా సోమవారం రోజు భారత ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో టెస్లా పెట్టుబడి ప్రతిపాదనపై ప్రత్యేక చర్చ జరిగింది. దీంతోపాటు మన దేశంలో ఎలక్ట్రిక్ కార్లు, బైక్స్, స్కూటర్ల తయారీని ఎంకరేజ్ చేసే తదుపరి దశ ప్రభుత్వ పథకాలపైనా డిస్కషన్ జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఏడాది జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని మోడీ, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. అప్పటి నుంచే భారత్‌కు చెందిన వాణిజ్యం, పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలు టెస్లాతో చర్చలు జరుపుతున్నాయి. టెస్లా కార్లను ఇతర దేశాల్లోని టెస్లా ప్లాంట్ల నుంచి భారత్‌కు దిగుమతి చేయడానికి భారత సర్కారు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. భారత్‌లోనే ప్లాంట్ ఏర్పాటు చేయాలని టెస్లాను కోరింది. ఒకవేళ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ప్రత్యక్ష రాయితీలను అందించే మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా ప్రోత్సాహకం అందిస్తామని తేల్చి చెప్పింది.2030 నాటికి 2 కోట్ల కార్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో టెస్లా ఉంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్‌లో ప్లాంట్ల ఏర్పాటు దోహదం చేస్తోందని టెస్లా భావిస్తున్నట్లు(Tesla Cars – India) తెలుస్తోంది.