Tata Sierra: ఈ సంవత్సరం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టాటా మోటార్స్ మొదటిసారిగా కొత్త సియెర్రాను (Tata Sierra) ఆవిష్కరించింది. అప్పటి నుంచి దీని లాంచ్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. భారతదేశంలో కొత్త సియెర్రాను EV, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో విక్రయానికి అందుబాటులోకి తీసుకురానుంది. దీనిని టాటా Gen2 EV ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేయనున్నారు. కొత్త మోడల్ ఈసారి అనేక పెద్ద మార్పులతో రానుంది. కంపెనీ దీనిపై వేగంగా పనిచేస్తోంది. గతంలో ఈ కారును ఈ ఏడాది జూన్‌లో లాంచ్ చేయవచ్చని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ కారును ఆగస్టు నెలలో లాంచ్ చేయవచ్చు.
ఆగస్టులో లాంచ్ కానున్న కొత్త టాటా సియెర్రా
నివేదికల ప్రకారం.. కొత్త టాటా సియెర్రాను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన లాంచ్ చేయవచ్చు. కొత్త సియెర్రాలో మొదటిసారిగా అనేక మంచి, ఉపయోగకరమైన ఫీచర్లను చేర్చవచ్చు. ఇందులో యూజర్ల కోసం ప్రీమియం సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ల వంటి ఫీచర్లు లభించవచ్చు.
సేఫ్టీ ఫీచర్లలో ఎలాంటి లోటు ఉండదు
సేఫ్టీ కోసం కొత్త సియెర్రాలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), లెవెల్ 2 ADAS వంటి ఫీచర్లను అందించవచ్చు. అంతేకాకుండా ఇందులో 3 స్క్రీన్‌లు కనిపించనున్నాయి. వీటిలో ఒక డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఒక సెంట్రల్ టచ్‌స్క్రీన్, ఒక ప్యాసింజర్ సైడ్ టచ్‌స్క్రీన్ కూడా ఉన్నాయి. అన్ని స్క్రీన్‌లు 12.3 ఇంచ్‌ల పరిమాణంలో ఉండవచ్చు.
Also Read: TDP Mahanadu : టీడీపీ మహానాడు – లోకేష్‌కు ప్రమోషన్?
ఇంజన్- పవర్
కొత్త టాటా సియెర్రాలో 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఇది 170hp పవర్, 280 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇంకా ఇందులో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా లభిస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. ఈ SUV AWD (ఆల్-వీల్ డ్రైవ్) టెక్నాలజీతో కూడా అందుబాటులో ఉండవచ్చు. ధర విషయానికొస్తే భారతదేశంలో దీనిని 10.50 లక్షల రూపాయల ప్రారంభ ధరతో పరిచయం చేయవచ్చు. భారతదేశంలో ఈ కారు కోసం చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ కారులో ఏమైనా కొత్త ఫీచర్లు కనిపిస్తాయి ఏమో చూడాలి.