Tata Punch Sales: టాటా పంచ్ విక్ర‌యాల్లో భారీ క్షీణ‌త‌.. ఫిబ్ర‌వ‌రిలో ఎన్ని అమ్ముడుపోయాయంటే?

టాటా పంచ్ ఇండియాకి వచ్చి చాలా రోజులైంది. కానీ ఇప్పటివరకు దానిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. దీని వలన వినియోగదారులు దానిపై ఆస‌క్తి చూప‌టంలేదు.

Published By: HashtagU Telugu Desk
Tata Punch Sales

Tata Punch Sales

Tata Punch Sales: కొంతకాలం క్రితం వరకు టాటా మోటార్స్ చౌకైన SUV టాటా పంచ్ విక్రయాలలో (Tata Punch Sales) మొదటి స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. అమ్మకాల పరంగా ఈ పంచ్ బలహీనంగా మారింది. దీని విక్రయాలు ప్రతినెలా పడిపోతున్నాయి. గత నెలలో కూడా అమ్మకాలు భారీగా తగ్గాయి. పంచ్ దాని విభాగంలో బలమైన SUV, మంచి నాణ్యతను కలిగి ఉంది. నిరంతర క్షీణత వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది.

పంచ్ విక్రయాల్లో 21% క్షీణత

గత నెలలో టాటా మోటార్స్ 14,559 యూనిట్ల పంచ్‌లను విక్రయించగా, గత ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ ఈ కారును 18,438 యూనిట్లను విక్రయించింది. ఈసారి 21 శాతం క్షీణత నమోదైంది. గతేడాదితో పోలిస్తే కంపెనీ 3879 తక్కువ యూనిట్లను విక్రయించింది.

Also Read: Shreyas Iyer: శ్రేయాస్‌ అయ్యర్ సంచ‌ల‌న ప్రకటన.. గుర్తింపు రాలేద‌ని కామెంట్స్‌!

క్షీణత ఎందుకు?

టాటా పంచ్ ఇండియాకి వచ్చి చాలా రోజులైంది. కానీ ఇప్పటివరకు దానిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. దీని వలన వినియోగదారులు దానిపై ఆస‌క్తి చూప‌టంలేదు. ఇలాంటి ప‌రిస్థితిలో వినియోగదారులు ఇప్పుడు ఇతర ఎంపికల కోసం చూస్తున్నారు. టాటా పంచ్ పెట్రోల్, CNG, EVలలో లభిస్తుంది. స్థలం పరంగా కూడా ఈ కారు నిరాశపరచదు. అందులో 5 మంది సులభంగా కూర్చోవచ్చు.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్

టాటా మోటార్స్ త్వరలో పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈసారి కొత్త మోడల్‌లో చాలా పెద్ద మార్పులను చూడవచ్చు. అయితే దీని ఇంజన్‌లో ఎలాంటి మార్పులు కనిపించవు. కంపెనీ ఇందులో 1.2లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఇన్‌స్టాల్ చేయ‌వ‌చ్చు. ఈసారి కొత్త మోడల్‌లో భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్ సౌకర్యం ఉంటుంది. టాటా పంచ్ నేరుగా హ్యుందాయ్ ఎక్సెటర్, నిస్సాన్ మాగ్నైట్‌తో పోటీపడుతుంది. ఈ రెండు SUVలు రోజువారీ వినియోగంతో ఎక్కువ దూరాలకు బాగా పని చేస్తాయి.

  Last Updated: 11 Mar 2025, 04:08 PM IST