Tata Punch: భారత్‌ లో మన బడ్జెట్ లో దొరికే 5 స్టార్ రేటెడ్ మోస్ట్ సేఫ్టీ కారు ఇదే.

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు (Road Accidents) ఎక్కువే. గతుకుల రోడ్లకు లెక్కలేదు. అందుకే బలమైన,

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువే. గతుకుల రోడ్లకు లెక్కలేదు. అందుకే బలమైన, సురక్షితమైన వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రజలు ఇప్పుడు భద్రత కోసం మరింత డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో భారతీయ కంపెనీ టాటా మోటర్స్ (Tata Motors) తన కస్టమర్లకు 5 – స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో అతి తక్కువ ధరలో కారును అందిస్తోంది. ఈ కారు సాలిడ్ ఐరన్ పేరుతో ఫేమస్ అయ్యింది. 2021లో ప్రారంభించిన తర్వాత ప్రజలు.. మారుతి వ్యాగన్ఆర్, స్విఫ్ట్‌లకు బదులుగా దీన్ని కొంటున్నారు.

సబ్ కాంపాక్ట్ SUV టాటా పంచ్ (Tata Punch)

మనం మాట్లాడుకుంటున్న కారు.. టాటా మోటర్స్ (Tata Motors) నుంచి వచ్చిన చవకైన సబ్ కాంపాక్ట్ SUV టాటా పంచ్ (Tata Punch). విశేషమేమిటంటే ఈ మోడల్స్‌లో దేశంలోనే అత్యంత చవకైన కారు ఇది. పైగా దీనికి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ ఉంది. ఈ కారు ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాటా తన పంచ్‌ కారును తయారుచేయడానికి నాణ్యమైన మెటీరియల్‌ని ఉపయోగిస్తోంది. కారు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెనుక డీఫాగర్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, వెనుక వీక్షణ కెమెరా, భద్రత కోసం ISOFIX వంటి భద్రతా ప్రమాణాలను అందిస్తోంది. బాడీ లాగానే, పంచ్ ఇంజిన్ కూడా చాలా శక్తిమంతమైనది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగివుది. ఇది 86 bhp పవర్, 113 nm టార్క్ ఇస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్, ఆప్షనల్ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని మైలేజ్ లీటరుకు దాదాపు 19 కి.మీ.

టాటా పంచ్ ఫీచర్స్:

టాటా పంచ్ (Tata Punch) 5 మోడల్స్‌లో లభిస్తోంది. ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్, క్రియేటివ్‌లుగా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇవికాకుండా, కంపెనీ పంచ్ కోసం అడ్వెంచర్, అన్‌ఫినిష్డ్ ట్రిమ్‌లతో లభించే కామో ఎడిషన్ వంటి కొన్ని ప్రత్యేక ఎడిషన్‌లను కూడా విడుదల చేసింది. టాటా పంచ్ 5 గురు కూర్చునేందుకు వీలైన సీటింగ్ కెపాసిటీతో వస్తుంది. లోపల అందరికీ సరిపడా స్థలం అందుబాటులో ఉంది. కారు 366 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను కూడా కలిగివుంది. ఇందులో చాలా వస్తువులను ఉంచుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 187 మిల్లీమీటర్లు… ఇది కఠినమైన రోడ్లకు సరైనది. టాటా పంచ్ ఫీచర్ల గురించి చెప్పుకుంటే.. ఇది 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఆటో ఎయిర్ కండిషనింగ్, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి సౌకర్యాలను కలిగివుంది.

శుభవార్త ఏమిటంటే.. టాటా త్వరలో పంచ్ CNG వెర్షన్‌ను విడుదల చేయబోతోంది. డ్యూయల్ సిలిండర్ సిఎన్‌జి టెక్నాలజీని పొందిన మొదటి కారు ఇదే. ఇది కారు బూట్ స్పేస్‌ను కూడా తగ్గించేయదు. ఈ కొత్త మోడల్ ఈ సంవత్సరం చివరిలో వస్తుంది. టాటా పంచ్… భారత మార్కెట్లో మహీంద్రా KUV100 NXT, మారుతీ Ignisకు పోటీగా ఉంది. దీని ధర ట్యాగ్ ప్రకారం చూస్తే… ఇది నిస్సాన్ మాగ్నైట్, కొన్ని రెనాల్ట్ కిగర్ మోడల్‌లకు పోటీగా ఉంది.

Also Read:  OTT in Car: కారు స్క్రీన్‌పై ఓటీటీ యాప్స్ చూడాలనుకుంటున్నారా?