జనవరి 13న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్!

కారు వెనుక భాగంలో 'కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్' వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త డిజైన్‌తో కూడిన డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ దీనికి అదనపు ఆకర్షణ. మొత్తానికి దీని ప్రొఫైల్ 'పంచ్ ఈవీ'ని పోలి ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
Tata Punch Facelift

Tata Punch Facelift

Tata Punch facelift: టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో-SUV టాటా పంచ్‌ను సరికొత్త అవతారంలో తీసుకురాబోతోంది. ‘పంచ్ ఫేస్‌లిఫ్ట్’కు సంబంధించిన మొదటి టీజర్‌ను కంపెనీ విడుదల చేయడంతో పాటు లాంచ్ తేదీని కూడా ఖరారు చేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ కారు జనవరి 13న భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. గత కొన్ని నెలలుగా టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు, ఎట్టకేలకు షోరూమ్‌లకు వచ్చేందుకు సిద్ధమైంది. కొత్త డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, అదే నమ్మకమైన ఇంజిన్‌తో ఈ మోడల్ రాబోతోంది.

మరింత ధృడమైన లుక్

టీజర్ వీడియో ప్రకారం.. కొత్త టాటా పంచ్ మునుపటి కంటే చాలా పవర్‌ఫుల్, మాకో లుక్‌లో కనిపిస్తోంది. ఇది మైక్రో-SUV అయినప్పటికీ రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఒక పెద్ద SUV ఇచ్చే రాజసాన్ని అందిస్తుంది. దీని ఎక్స్‌టీరియర్ మార్పులు కారుకు మరింత బోల్డ్, ఫ్రెష్ లుక్‌ని ఇచ్చాయి.

ముందు భాగంలో కొత్త LED ఎలిమెంట్స్

కొత్త పంచ్ ఫ్రంట్ డిజైన్‌లో స్పష్టమైన మార్పులు ఉన్నాయి. ఇందులో కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, స్లిమ్ డీఆర్ఎల్ (DRLs) అందించారు. గ్రిల్, బంపర్‌ను కూడా కొత్తగా డిజైన్ చేయడం వల్ల కారు ప్రీమియం లుక్‌ను సంతరించుకుంది.

రియర్- సైడ్ ప్రొఫైల్

కారు వెనుక భాగంలో ‘కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్’ వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త డిజైన్‌తో కూడిన డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ దీనికి అదనపు ఆకర్షణ. మొత్తానికి దీని ప్రొఫైల్ ‘పంచ్ ఈవీ’ని పోలి ఉంటుంది.

Also Read: షాకింగ్‌.. జొమాటో నుండి ప్రతి నెలా 5,000 మంది తొలగింపు!

ఆధునిక ఇంటీరియర్

కారు లోపల కూడా భారీ మార్పులు ఉండబోతున్నాయి.

10.25-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.

పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.

కొత్త స్టీరింగ్ వీల్, అప్‌డేటెడ్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్.

భద్రత- టెక్నాలజీ

టాటా కార్లు అంటేనే భద్రతకు మారుపేరు. కొత్త పంచ్‌లో 360-డిగ్రీ కెమెరా, ADAS వంటి అధునాతన ఫీచర్లను చేర్చే అవకాశం ఉంది. దీనివల్ల ఈ సెగ్మెంట్‌లో ఇది అత్యంత సురక్షితమైన కారుగా నిలవనుంది. ఇంజిన్ పరంగా పెద్ద మార్పులు లేవు. ఇందులో అదే 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 87 bhp పవర్, 115 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. అలాగే టాటా ‘ట్విన్ సిలిండర్’ టెక్నాలజీతో కూడిన CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది.

  Last Updated: 04 Jan 2026, 09:23 PM IST