Site icon HashtagU Telugu

TATA: తక్కువ ధరకే దిమ్మతిరిగే ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ కారు.. పూర్తి వివరాలివే?

Mixcollage 14 Jan 2024 05 00 Pm 3324

Mixcollage 14 Jan 2024 05 00 Pm 3324

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేయడానికి వాహన వినియోగదారులు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉండడంతో కొనుగోలుదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే ఇప్పటికే ఎన్నో రకాల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశీయ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ టాటా తక్కువ ధరలోనే అదిరిపోయే అధునాతన ఫీచర్లతో టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారుకు మార్కెట్ లోకి తీసుకొస్తోంది.

ఇప్పటికే ఈ వెహికిల్ బుకింగ్స్ కూడా షురూ చేయగా ఇప్పుడు లాంచింగ్ డేట్ బయటకొచ్చింది. జనవరి 17న ఈ టాటా పంచ్ ఈవీ లాంచింగ్ చేయబోతున్నారు. లాంచ్ అయిన వెంటనే డెలివరీలు ప్రారంభిస్తారట. ఈవీ సెగ్మెంట్ లో టాటా పంచ్ ఈవీ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUVగా నిలవనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కారులో 300 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. టాటా కంపెనీ అంతకుముందు వచ్చిన మరో ఈవీ SUV టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ తో పోలిస్తే, టాటా పంచ్ ఈవీ మరింత భిన్నంగా కనిపిస్తుంది. ఈ వెహికిల్ లో క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, స్లిమ్ LED హెడ్‌ ల్యాంప్‌లు ఉంటాయి. టాటా పంచ్ ఈవీ లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది.

అలాగే కొత్త ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ తో పాటు 360 డిగ్రీ కెమెరా, వెంటిలేషన్‌తో ఉన్న లెథెరెట్ సీట్లు, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్‌లెస్ ఛార్జింగ్, కార్ టెక్, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్ తదితర ఫీచర్స్ ఉంటాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 11-14 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. టాటా డీలర్స్ వద్ద టోకెన్ అమౌంట్ గా రూ. 21,000 చెల్లించి టాటా ఈవీ పంచ్ ను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ఆర్డర్స్ ప్రకారం డెలివరీ ఉంటుందని టాటా మోటార్స్ సంస్థ చెబుతోంది. ఈ వెహికిల్ సరసమైన ధరలో లభిస్తుండటంతో వినియోగదారులు క్యూలు కడుతున్నారు.

Exit mobile version