Tata Punch EV Launch : మార్కెట్ లోకి విడుదల టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్.. సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా అన్ని కిమీ ప్రయాణం?

ప్రముఖ టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ భారత మార్కెట్లో జనవరి 17న టాటా పంచ్ ఈవీ కారును లాంచ్ చేసింది. ఈ ఎలక్ట

  • Written By:
  • Publish Date - January 17, 2024 / 08:00 PM IST

ప్రముఖ టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ భారత మార్కెట్లో జనవరి 17న టాటా పంచ్ ఈవీ కారును లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 14.49 లక్షలు ఉంటుంది.
ఇకపోతే ఎలక్ట్రిక్ కారు ఫీచర్ల విషయానికొస్తే.. కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. టాటా పంచ్ ఈవీ టెక్నాలజీ ఫీచర్లలో ప్రామాణిక మోడల్‌ 60కిలోవాట్/114ఎన్ఎమ్ శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ ఏసీ మోటార్ అమర్చబడి ఉంటుంది. అయితే, లాంగ్ రేంజ్ మోడల్ 90 కిలో వాట్/190ఎన్ఎమ్ శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ ఏసీ మోటార్‌ను పొందుతుంది.

25కెడబ్ల్యూ‌హెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ప్రామాణిక మోడల్ 315కిలోమీటర్ల క్లెయిమ్ పరిధిని కలిగి ఉంది. లాంగ్ రేంజ్ మోడల్ 35కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ ద్వారా సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 421 కిలోమీటర్లు పరిధిని అందిస్తుంది. మోటారు, బ్యాటరీ ప్యాక్ ఐపీ67-రేటెడ్, ఎనిమిదేళ్లు లేదా 1 లక్ష 60వేల కిలోమీటర్ల వారంటీని కలిగి ఉంటాయి. టాటా పంచ్ ఈవీ మోడల్ 3.3కిలోవాట్ ఏసీ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్ ద్వారా 9.4 గంటల్లో 10 నుంచి 100శాతం, 7.2కిలోవాట్ ఏసీ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్ ద్వారా 3.6 గంటల్లో, 15ఏ ప్లగ్ పాయింట్‌ను 9.4 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. 50కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి బ్యాటరీని 56 నిమిషాల్లో 10 నుంచి 80శాతం నుంచి ఛార్జ్ చేయవచ్చు.

టాటా పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ 3.3కిలోవాట్ ఏసీ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్, 15 ఏ ప్లగ్ పాయింట్ ద్వారా 10-100శాతం ఛార్జ్ చేయడానికి 13.5 గంటలు పడుతుంది. 7.2కిలోవాట్ ఏసీ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్ ద్వారా ఇదే విధమైన ఛార్జీకి 5 గంటలు పడుతుంది. 50కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 56 నిమిషాల్లో 10 నుంచి 80శాతం ఛార్జ్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎకో, సిటీ, స్పోర్ట్ మూడు డ్రైవ్ మోడ్‌లతో వస్తుంది. కనిష్ట, ఇంటర్మీడియట్ యాడ్ మ్యాగ్జిమమ్ అనే న్యూ జనరేషన్స్ మోడ్స్ ఉన్నాయి. రీజెన్ మోడ్‌ను కూడా స్విచ్ ఆఫ్ చేయవచ్చు. ఇతర వాటిలో వెహికల్ అన్‌లాడెన్ గ్రౌండ్ క్లియరెన్స్ 190ఎమ్ఎమ్, వాటర్ వాడింగ్ సామర్ధ్యం 350ఎమ్ఎమ్ ఉన్నాయి. ఇకపోతే ఈ కార్ వేరియంట్‌ల విషయానికి వస్తే..

టాటా పంచ్ ఈవీలో స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ అనే ఐదు వేరియంట్లు ఉండగా అందులో ఎంపవర్డ్ రెడ్, సీవీడ్, ఫియర్‌లెస్ రెడ్, డేటోనా గ్రే ప్రిస్టైన్ వైట్ అనే ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. మరి ఈ కారు యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే..టాటా పంచ్ ఈవీ అనేది టాటా నెక్సాన్. ఈవీలో కనిపించే అదే డిజైన్ లాంగ్వేజీపై ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఫ్రంట్ సైడ్ ఎల్ఈడీ స్ట్రిప్ రన్ అవుతుంది. సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌లతో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. బ్యాక్ డిజైన్ టాటా పంచ్ పెట్రోల్ మాదిరిగానే ఉంటుంది.