Tata Punch EV: ప్రస్తుతం భారత్‌లో అత్యంత సరసమైన 5-సీటర్ ఎలక్ట్రిక్ SUVగా టాటా పంచ్ EV గుర్తింపు పొందింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న తరుణంలో మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక గొప్ప ఎంపికగా మారింది. SUV వంటి దృఢమైన లుక్, టాటా భరోసా ఇచ్చే భద్రత, తక్కువ నిర్వహణ ఖర్చు దీని ప్రత్యేకతలు.
ధర- ఆఫర్లు
టాటా పంచ్ EV ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 9.99 లక్షలు (Smart MR బేస్ వేరియంట్). దీని టాప్ వేరియంట్ ధర రూ. 14.99 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ 100% ఆన్-రోడ్ ఫైనాన్సింగ్ సౌకర్యంతో పాటు రూ. 1.20 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కారు కేవలం రూ. 8,099 నెలవారీ ఈఎంఐతో కూడా ఈ కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు.
Also Read: బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. మరో హిందూ యువకుడిపై మూకదాడి, మృతి!
బ్యాటరీ, రేంజ్, ఛార్జింగ్
టాటా పంచ్ EV రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 315 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 421 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. DC ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 56 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు.
అత్యాధునిక ఫీచర్లు
ఈ కారులో ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చే అనేక ఫీచర్లు ఉన్నాయి. పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్, డిజిటల్ డిస్ప్లే ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో (Android Auto), యాపిల్ కార్‌ప్లే (Apple CarPlay) ఉన్నాయి. 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి. భారతీయ రోడ్లకు అనుగుణంగా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది.
భద్రతలో నంబర్ వన్
సేఫ్టీ విషయంలో టాటా ఎప్పుడూ ముందుంటుంది. పంచ్ EV కూడా దానికి మినహాయింపు కాదు. దీనికి Bharat NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. మీరు రూ. 10 లక్షల బడ్జెట్‌లో సురక్షితమైన, స్టైలిష్, మంచి రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ SUV కోసం చూస్తుంటే టాటా పంచ్ EV ఒక అద్భుతమైన ఎంపిక.
