Tata EV’s price cut: ఈవీ ధరలను భారీగా తగ్గించిన టాటా మోటార్స్​.. అన్ని లక్షలు డిస్కౌంట్?

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ తాజాగా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఎలక్ట్రిక్​ వాహనాల పోర్ట్​ఫోలియోలో బెస్ట్​ సెల్లింగ

Published By: HashtagU Telugu Desk
Mixcollage 13 Feb 2024 06 54 Pm 5145

Mixcollage 13 Feb 2024 06 54 Pm 5145

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ తాజాగా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఎలక్ట్రిక్​ వాహనాల పోర్ట్​ఫోలియోలో బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​గా ఉన్న రెండు ఈవీల ధరలను భారీగా తగ్గించింది టాటా మోటార్స్​. ఆ రెండు వాహనాలు టాటా నెక్సాన్​ ఈవీ, టాటా టియాగో ఈవీ. మరి ఏ వాహనాలపై ఎంత డిస్కౌంట్ లభించింది అన్న వివరాల్లోకి వెళితే.. ఇండియా ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతోంది టాటా మోటార్స్​.

ఈ సెగ్మెంట్​లో అత్యధిక మార్కెట్​ షేరు కలిగి ఉన్న సంస్థ ఇదే. మరీ ముఖ్యంగా.. ఎంట్రీ లెవల్​ టాటా టియాగో ఈవీకి సూపర్​ డిమాండ్​ కనిపిస్తోంది. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​పై రూ. 70వేలు తగ్గించింది టాటా మోటార్స్​. ఈ ప్రైజ్​ కట్​తో ఇప్పుడు ఇక టాటా టియాగో ఈవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 7.99లక్షలకు చేరింది. ఇక మరో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ టాటా నెక్సాన్​. ఈవీపై ఏకంగా రూ. 1.2లక్షల వరకు ధరలను తగ్గించింది టాటా మోటార్స్​. టాటా నెక్సాన్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 14.49 లక్షలకు పడిపోయింది. లాంగ్​ రంజ్​ వర్షెన్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 16.99 లక్షలుగా ఉంది.

ఎలక్ట్రిక్​ వాహనాల్లో బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. జాగ్రత్త ఈ మధ్య కాలంలో బ్యాటరీ ప్యాక్​ల ధరలు దిగొస్తున్నాయి. బ్యాటరీ సెల్స్​ కొనుగోలు చేస్తున్న వారికి కాస్త ఉపశమనం దక్కింది. అందుకే ఈవీల ధరలను తగ్గించాలని టాటా మోటార్స్​ సంస్థ భావించింది. అయితే ఇటీవల లాంచ్​ అయిన టాటా పంచ్​ ఈవీ ఇంట్రొడక్టరీ ప్రైజ్​ని టాటా మోటార్స్​ కట్​ చేయలేదు. ఇంకా చెప్పాలంటే బ్యాటరీ ప్యాక్​ ధర తగ్గడాన్ని దృష్టిలో పెట్టుకునే, లాంచ్​ సమయంలో ఆ ధరను ప్రకటించామని సంస్థ చెప్పుకొచ్చింది. అంటే ఇప్పట్లో టాటా పంచ్​ ఈవీ ధరలు తగ్గవు.

  Last Updated: 13 Feb 2024, 06:56 PM IST