Site icon HashtagU Telugu

Tata Nexon: నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో మంటలు..వైరల్ వీడియో..!!

Tata Nexon Ev Fire

Tata Nexon Ev Fire

నిన్న మొన్నటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మంటలు అనే వార్తలు చూశాం. ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రిక్ కారులోనే మంటలు చెలరేగాయి. ఈ వైరల్ వీడియో ముంబైలోని వెస్ట్ వసాయ్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ బయట టాటా నెక్సాన్ ఈవీ కారులో మంటల్లో కాలి బూడిదైంది. ఫైర్ సిబ్బంది కూడా మంటలను ఆర్పేందుకు ట్రాఫిక్ ను నియంత్రించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో భారత్ లో విక్రయించే ఎలక్ట్రిక్ వాహనాల భద్రత గురించి పెద్ద చర్చే జరుగుతోంది. నెక్సాన్ ఈవీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ ఈవీ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ఘటన గురించి కంపెనీ ఓ ప్రకటన చేసింది. భవిష్యత్ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

కంపెనీ విడుదల చేసిన ప్రకటన..
నెక్సాన్ ఈవీ అగ్నిప్రమాదానికిగల కారణాలపై విచారణకు హామీ ఇస్తున్నట్లు టాటా మోటార్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. తాజాగా జరిగిన అగ్నిప్రమాద ఘటన వాస్తవాలను నిర్ధారించడానికి పూర్తి దర్యాప్తు జరుగుతోంది. విచారణ తర్వాత కారణాలను వెల్లడిస్తాము…అని సంస్థ తెలిపింది. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన వ్యక్తి మంటలను పూర్తిగా ఆర్పిన తర్వాత మరో వీడియోను కూడా షేర్ చేశాడు.

కాగా ఎలక్ట్రిక్ స్కూటర్ల అగ్నిప్రమాదం తర్వాత ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ కూడా సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నివేదికలు ఉన్నాయని పోస్ట్ చేశాడు. అయితే సంఘటనలు జరిగినప్పుడు ఐసీఈ వెహికల్స్ కంటే ఈవీలు సురక్షితమైనవి అన్నారు.