Site icon HashtagU Telugu

Tata Nexon EV Offers: బంపర్ ఆఫర్.. నెక్సాన్ ఈవీ కార్లకు భారీగా డిమాండ్.. ధరలు ఎంతంటే?

Mixcollage 09 Feb 2024 03 15 Pm 8444

Mixcollage 09 Feb 2024 03 15 Pm 8444

టాటా మోటార్స్ సంస్థ తాజాగా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. నెక్సాన్ ఈవీపై లక్ష వరకు తగ్గింపు అందిస్తోంది. గత ఏడాది తయారు చేసిన కార్లపై ఈ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. నెక్సాన్ ఈవీ ని కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లకు MY2023 స్టాక్‌పై కంపెనీ మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది. క్యాష్‌ ఆఫర్‌లు, ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌లు, కార్పొరేట్ బోనస్‌లు, ఇతర డీలర్-ఎండ్ ఆఫర్‌లను ఇస్తోంది. వేరియంట్‌ను బట్టి ఆఫర్ కూడా మారుతుంది. కాగా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఫియర్‌లెస్ MR, ఎంపవర్డ్+LR, ఎంపవర్డ్ MR వేరియంట్‌ లపై రూ.50 వేల విలువైన ఆఫర్ లను అందిస్తోంది.

ఫియర్‌లెస్+MR, ఫియర్‌లెస్+S MR, ఫియర్‌లెస్+LR వేరియంట్‌ లపై రూ.65 వేల విలువైన తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఫియర్‌లెస్ LR వేరియంట్‌పై రూ.85 వేల వరకు తగ్గింపు లభిస్తుండగా టాప్-స్పెక్ ఫియర్‌లెస్+ S LR మోడల్‌పై లక్ష రూపాయల వరకు ఆఫర్ ప్రకటించింది. నెక్సాన్ ఈవీ రెండు పవర్‌ఫుల్ బ్యాటరీల వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 30.2kWh బ్యాటరీతో MR, 40.5kWh బ్యాటరీతో LR ఉన్నాయి. MR లిమిట్ 325 కి.మీ కాగా LR లిమిట్ 465 కిలోమీటర్లు ఉంది. 7.2kW AC ఛార్జర్‌ని ఉపయోగించి ఆరు గంటల్లో 10 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అవుట్‌పుట్ విషయానికి వస్తే..

MR వేరియంట్ 129hp, 215Nm, LR 145hp, 215Nm అవుట్‌పుట్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఈ ఆఫర్ కేవలం నెక్సాన్ ఈవీ కార్లపైనే కాకుండా టాటా డీలర్‌లు ప్రీ-ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ SUV కార్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. నెక్సాన్ ఈవీ ప్రైమ్‌పై రూ.1.90 లక్షల నుంచి రూ.2.30 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. టాప్-స్పెక్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ రూ.2.80 లక్షల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో ప్రకటించిన తగ్గింపు కంటే రూ.20 వేల ఎక్కువ కావడం విశేషం. నెక్సాన్ ఈవీ ప్రైమ్ 129hp ఎలక్ట్రిక్ మోటారు, 30.2kWh బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్‌లోకి వస్తుంది. 312 కి.మీ లిమిట్ వస్తుంది. నెక్సాన్ ఈవీ మాక్స్ 40.5kWh బ్యాటరీ ప్యాక్‌తో 143hp ఎలక్ట్రిక్ మోటారుతో అందుబాటులో ఉంది. దీని లిమిట్ 437 కి.మీ.