Site icon HashtagU Telugu

Tata Nano EV: టాటా నానో ఈవీ లాంచింగ్ డేట్ ఫిక్స్.. ధర ఫీచర్స్ ఇవే!

Tata Nano Ev

Tata Nano Ev

త్వరలో టాటా నానో కొత్త వెర్షన్‌ అందుబాటులోకి రాబోతున్న విషయం తెలిసిందే. వరకడికంటే ఈసారి అద్భుతమైన ఆకట్టుకునే ఫీచర్లతో పాటుగా ఎలక్ట్రిక్ వర్షన్ లో టాటా నానో ఈవీ కారు ని అందుబాటులోకి తీసుకురావడానికి టాటా సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అయితే ఇప్పటికే ఈ కారుకు సంబంధించి ఎన్నో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. కానీ ఈ కారుకు సంబంధించి ఈ కంపెనీ ఎలాంటి ప్రకటన మాత్రం ఇవ్వలేదు. కానీ తాజాగా ఈ కారు విడుదలకు సంబంధించి ఎట్టకేలకు ఓకే ప్రకటన చేసింది. టాటా నానో ఈవీ కారును ఈ ఏడాది చివరల్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో మరోసారి టాటా నానో కారుకు సంబంధించిన చర్చ మొదలైంది. ఈ కారు కచ్చితంగా ప్రజలను ఆకర్షిస్తుందని కంపెనీ ధీమాతో ఉంది. దీనికి కారణం ఇందులో తీసుకురానున్న ఫీచర్లే. మరీ తక్కువ ధర కాకుండా మిడ్ రేంజ్‌లో ఈ కారును తీసుకొస్తున్నారట. మరి ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఈ కారు 15 కేడబ్ల్యూహెచ్‌ కెపాసిటీతో కూడిన బ్యాటరీతో రానుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 312 కి.మీల రేంజ్‌ ఇస్తుందట. ఇక ఈ కారు గంటకు 120 కి.మీల వేగంతో దూసుకెళ్తుంది. 4 సీట్ కెపాసిటీతో వచ్చే ఈ కారులో 7 ఇంచెస్‌ టచ్‌ స్క్రీన్‌ తో కూడిన ఇన్ఫొమెంట్ సిస్టమ్‌ ను అందించనున్నారు.

అలాగే ఇందులో 6 స్పీకర్లను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పవర్‌ స్టీరింగ్, పవర్‌ విండోస్‌ ఈ కారు సొంతం అని చెప్పాలి. యాంటీ లాక్‌ బ్రేక్ సిస్టమ్‌తో కూడిన ఈ కారు కేవలం 10 సెకండ్లలో 0 నుంచి 100 కి.మీల వేగాన్న అందుకోగలదు. ఎయిర్‌ బ్యాగ్స్‌ తో రానుంది. ఇకపోతే ధర విషయానికొస్తే.. ఈ కారు బేస్‌ వేరియంట్ రూ. 3.5 లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో టాప్‌ వేరియంట్ రూ. 5 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ కారుకు సంబంధించిన అధికారిక ఫొటో, అలాగే మరిన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు.