Tata Nano EV: 2008లో టాటా నానో భారతీయ రోడ్లపైకి వచ్చినప్పుడు అది మొత్తం ఆటో పరిశ్రమ ఆలోచనా విధానాన్నే మార్చివేసింది. సామాన్యుడి కారుగా పేరొందిన నానో, స్కూటర్ నుండి కారుకు మారాలనుకునే కుటుంబాల కలగా నిలిచింది. ఇప్పుడు మరోసారి టాటా నానో 2026 గురించి చర్చలు జోరందుకున్నాయి. టాటా మోటార్స్ ఈ ఐకానిక్ కారును ఆధునిక హంగులతో, సరికొత్త అవతారంలో తిరిగి తీసుకురావచ్చని భావిస్తున్నారు.
కొత్త ఆలోచనతో టాటా నానో పునరాగమనం?
New Tata Nano 2026ని ఒక నిజమైన ఫ్యామిలీ కారుగా రూపొందిస్తున్నట్లు సమాచారం. నగర ట్రాఫిక్‌లో సులభంగా వెళ్లడానికి వీలుగా ఇది కాంపాక్ట్ సైజులో ఉంటుంది. నలుగురు పెద్దలు సౌకర్యవంతంగా కూర్చునేలా మెరుగైన హెడ్‌రూమ్, లెగ్‌రూమ్‌పై దృష్టి సారించారు. భారతీయ రోడ్లకు అనుగుణంగా దీని సస్పెన్షన్, డ్రైవ్ క్వాలిటీ ఉండే అవకాశం ఉంది.
సేఫ్టీ- ఫీచర్లు
కొత్త నానోలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABSతో కూడిన EBD, బలమైన బాడీ స్ట్రక్చర్ వంటి భద్రతా ఫీచర్లు ఉండవచ్చు. కేబిన్‌లో నాణ్యమైన మెటీరియల్, సౌకర్యవంతమైన సీట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఆశించవచ్చు. LED లైట్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సాఫ్ట్-టచ్ ఇంటీరియర్‌తో ఇది నగర ప్రయాణాలకు సరిగ్గా సరిపోతుంది.
Also Read: ప్రతీక్ జైన్ పై ఈడీ రైడ్స్, అసలు ఎవరు ప్రతీక్ జైన్ ? ఎందుకు రైడ్స్ చేసారు ?
అద్భుతమైన మైలేజీ- ఇంజిన్
దీనిలో 1.2 లీటర్ రిఫైన్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. కొన్ని వేరియంట్లలో CNG ఆప్షన్ కూడా ఉండవచ్చు. లీక్ అయిన నివేదికల ప్రకారం.. ఇది 44-46 KMPL వరకు మైలేజీని ఇవ్వగలదని, నగరాల్లో కూడా 35-40 KMPL మైలేజీ ఆశించవచ్చని సమాచారం.
ధర- ఎలక్ట్రిక్ వెర్షన్
దీని ప్రారంభ ధర రూ. 1.5 లక్షల నుండి రూ. 3.5 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. టాటా మోటార్స్ కొత్త నానోను ఆధునిక ఎలక్ట్రిక్ (EV) రూపంలో కూడా తీసుకురావచ్చని కొన్ని అంచనాలు ఉన్నాయి. 2018లో నిలిచిపోయిన నానో ఉత్పత్తి ఇప్పుడు సరికొత్త రూపంలో రావడం బడ్జెట్ కారు సెగ్మెంట్‌లో పెద్ద మార్పును తీసుకురాగలదు.
