Site icon HashtagU Telugu

Tata Motors :అరగంట చార్జ్ చేస్తే 600కి.మీ వెళ్లొచ్చు..టాటా అవిన్య ఫీచర్లు ఇవే!!

The Tata Avinya Concept Car

The Tata Avinya Concept Car

ఇప్పుడంతా…ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తోంది. పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు, విపరీతమైన కాలుష్యం…వీటన్నింటికి చెక్ పెట్టేందుకు సంప్రదాయ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే విదేశాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు పాపులర్ అయినా…మన భారత్ లో మాత్రం ఇప్పుడిప్పుడే జనాలు వాటి వైపు మళ్లుతున్నారు.

ప్రముఖ దేశీయ ఆటోరంగ సంస్థ అయినా టాటా కూడా నెక్సాన్ పేరిట ఓ ఎలక్ట్రిక్ వెహికల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే లేటెస్టుగా ఈవీలో ఓ కాన్సెప్టుకు సంస్థ శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఆ కారు డిజైన్ను ఆవిష్కరించింది. కారుకు అవిన్య అనే నామకరణం చేసింది. అవిన్య అంటే సంస్కృత భాషలో ఆవిష్కరణ అనే అర్థం. డ్రైవింగ్ చేసేటప్పుడు మధురానుభూతులను పొందేందుకు డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ వచ్చేంతవరకు న్యూ జనరేషన్ టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ కృత్రిమ మేధను ఇందులో పొందుపరిచనట్లుగా టాటా సంస్థ వెల్లడించింది.

థర్డ్ జనరేషన్ నిర్మాణ సాంకేతికతతో అవిన్యకు టాటా కొత్త రూపునిచ్చింది. ప్రపంచంలోని అత్యున్నతమైన కాన్సెప్ట్ కార్లన్నింటినీ వడపోసి రూపొందించినట్లుగా అవిన్య వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంది. కారుకు బటర్ ఫ్లే డోర్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. ఇంటీరియర్ ను చాలా అందంగా డిజైన్ చేశారు. రోడ్డు నుంచి దృష్టి మళ్లించకుండే వాటిని ఇంటీరియర్ లో తప్పించారు. అంతేకాదు డ్రైవర్ మీద ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించారు.

కొత్త జనరేషన్ సామాగ్రిని ఉపయోగించి కారును నిర్మించడం గొప్ప విశేషం. సమర్ధవంతమైన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తో అవిన్యకు రూపకల్పన చేశారు. లైట్ వెయిట్ మెటీరియల్ నూ వాడడం కారుకున్న మరో స్పెషల్. దీన్ని ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నిక్ తో అరగంటలో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే 500కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అయితే ఈ కారును పొందాలంటే 2025వరకు వేచిచూడాల్సిందే..!

Exit mobile version