Site icon HashtagU Telugu

Tata Motors price hike : వాహనాల ధరలను మళ్లీ పెంచేసిన ఆ టాటా మోటార్స్.. అమల్లోకి అప్పటినుంచే?

Mixcollage 22 Jan 2024 07 31 Pm 9026

Mixcollage 22 Jan 2024 07 31 Pm 9026

2024 తర్వాత ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఒకదాని తర్వాత ఒకటి వినియోగదారులకు వరసగా షాక్ లు ఇస్తున్నాయి. అందులో బాగంగానే తాజాగా కస్టమర్లకు మరోమారు షాక్​ ఇచ్చింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. తమ పోర్ట్​ఫోలియోలోని వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈసారి ప్యాసింజర్​ వాహనాలపై సగటున 0.7శాతం వరకు ప్రైజ్​ హైక్​ తీసుకోనున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా పెంచిన ధరలు వచ్చే నెల అనగా ఫిబ్రవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. వాహనాల ధరల పెంపునకు ఎప్పుడే చెప్పే విషయాన్నే ఈసారి కూడా తెలిపింది టాటా మోటార్స్​.

పెరుగుతున్న మడిసరకు ఖర్చుల కారణంగా వాహనాల ధరలను పెంచక తప్పడం లేదని తెలిపింది. అయితే ప్రైజ్​ హైక్​ గురించి చెప్పింది కానీ, ఆ తర్వాత వాహనాల ధరలకు సంబంధించిన లిస్ట్​ని మాత్రం టాటా సంస్థ ఇంకా ప్రకటించలేదు. దాదాపు అన్ని అటోమొబైల్​ సంస్థలు అదే పనిగా వాహనాల ధరలను పెంచుకుంటూ వెళుతున్నాయి. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల కారణంగా మారుతీ సుజుకీ ఇప్పటికే తన మొత్తం ప్యాసింజర్ వాహనాల శ్రేణిలో 0.45% ధరల పెంపును ప్రకటించింది. రానున్న రోజుల్లో ఈ జాబితా మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల కంపెనీలు ఈ ఏడాది ఆరంభం నుంచి వాహనాలపై ధరలను భారీగా పెంచేసాయి.

టాటా మోటార్స్​ తాజా నిర్ణయంతో అటు ఐసీఈ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్​ వాహనాల ధరలు కూడా పెరగనున్నాయి. టాటా మోటార్స్​కు పటిష్ఠమైన ఈవీ పోర్ట్​ఫోలియో ఉంది. నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, టియాగో ఈవీలకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. టాటా పంచ్​ ఈవీ కూడా ఇటీవలే టాటా మోటార్స్​ ఎలక్ట్రిక్​ వాహనాల లైనప్​లో చేరింది. ఇకపోతే తాజా ధరల పెంపు, వీటి సేల్స్​పై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి మరి. తమపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు వాహనాల ధరలను పెంచుకుంటూ వెళుతున్నాయి. కానీ కస్టమర్లపైనా భారీగానే భారం పడుతోంది. 2021 నుంచి అనేక మార్లు ప్రైజ్​ హైక్​ తీసుకున్నాయి. అప్పటి నుంచి కస్టమర్లు ఎక్కువ వెచ్చించి సొంత కారు కలను నెరవేర్చుకోవాల్సి వస్తోంది. అయితే వాహనాల ధరలు ఎంత పెరుగుతున్నా కొనేందుకు వినియోగదారులు వెనకడుగు వేయకపోతుండటంతో. మళ్లీ మళ్లీ ప్రైజ్​ హైక్​ తీసుకునేందుకు సంస్థలు ధైర్యం చేయగలుగుతున్నాయి.