టాటా అవిన్యా ఈవీ కారు.. ఈ కార్డును చూసిన ప్రతి ఒక్కరూ కూడా సొగసు చూడతరమా అన్న మాట అనలేకుండా ఉండలేకపోతున్నారు. అంతలా తన అద్భుతమైన కళ్ళు చెదిరే సూపర్ డిజైన్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటోంది టాటా అవిన్యా ఈవీ. ఈ కారును చూస్తున్నంత సేపు చూడాలనిపిస్తూ ఉంటుంది. అత్యంత ఆకర్షణీయంగా టెస్లా కారులా కన్పిస్తోంది. ఇదొక హై ఎండ్, లగ్జరీ, మోస్ట్ కంఫర్టబుల్ కారు. టాటా మోటార్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న కారు ఇది. ఈ కారును ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
చార్జింగ్ అవ్వడానికి కేవలం 30 నిమిషాలు పడుతుంది. మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో ఇదే బెస్ట్ అనే చర్చలు కూడా నడుస్తున్నాయి. బటర్ ప్లై డోర్లు ఈ అవిన్యా కారు ప్రత్యేకతల్లో ఒకటి. 3వ జనరేషన్ ఎలక్ట్రిఫికేషన్ తో ఈ కారు తయారైంది. అవిన్యా కారును స్క్రీన్ లెస్ విదానంలో రూపుదిద్దుకుంది. అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. కాగా Minimise, Maximise, Optimise టాటా అవిన్యా కారును తీసుకురావడంలో టాటా మోటార్స్ కాన్సెప్ట్ ఇదే. ప్రస్తుతం అందుబాటులో అన్ని ఎలక్ట్రిక్ కార్లతో ఇదే టాప్ అండ్ హై ఎండ్ కానుంది.
ఈ కారు ధర విషయానికి వస్తే.. కారు ప్రారంభ ధర 30 లక్షలు ఉండవచ్చని తెలుస్తోంది. ఇక ఇందులో హై ఎండ్ కారు అయితే 60 లక్షల రూపాయలు ఉండవచ్చనీ తెలుస్తోంది. అయితే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఆతృత పెంచుతున్న ఈ కారు 2025 అంటే వచ్చే ఏడాది జూన్ నెలలో మార్కెట్లో రావచ్చని అంచనా.